Little Hearts: టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యాయి. దసరా కానుకగా అక్టోబర్ 1న ఈటీవీ విన్ ఓటీటీలో లిటిల్ హార్ట్స్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌తో సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఈటీవీ ప్రకటించింది. కొన్ని ఎక్స్‌ట్రా కామెడీ సీన్లను ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేయనున్నారు.
యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ…
ఈ ఏడాది టాలీవుడ్‌లో సర్‌ప్రైజింగ్ హిట్‌గా నిలిచిన లిటిల్ హార్ట్స్‌లో మౌళి తనూజ్, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా నటించారు. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో సాయి మార్తాండ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ ఆదిత్య హసన్ నిర్మించిన ఈ సినిమాను బన్నీవాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.
ఈ చిన్న సినిమా నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఇరవై కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది. కేవలం 2.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తొలి రోజే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. థియేటర్లలో నలభై కోట్ల వరకు కలెక్షన్స్‌ను దక్కించుకున్నది.
Also Read – Deepika Padukone: ప్రభాస్‌కు హ్యాండిచ్చి…. హాలీవుడ్ హీరోతో సినిమా చేస్తున్న దీపికా పదుకొనె
కాన్సెస్ట్ పాతదే కానీ…
లిటిల్ హార్ట్స్‌లో రాజీవ్ కనకాల, జయకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సింజీత్ మ్యూజిక్ అందించాడు. లిటిల్ హార్ట్స్ కాన్సెప్ట్ పాతదే. కానీ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా స్క్రీన్‌పై ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మౌళి తనూజ్, జయకృష్ణ కామెడీ టైమింగ్ ఈ సినిమాకి ప్లస్సయ్యింది. సింజీత్ పాటలు కూడా పెద్ద హిట్టయ్యాయి.
టాలీవుడ్ హీరోలు ట్వీట్స్…
ఈ చిన్న సినిమాను మెచ్చుకుంటూ మహేష్‌బాబు, రవితేజ, నానితో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు ట్వీట్స్ చేశారు. లిటిల్ హార్ట్స్ హిట్‌తో మౌళి తనూజ్‌తో పాటు సాయి మార్తాండ్‌కు టాప్ బ్యానర్ల నుంచి ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. సాయి మార్తాండ్ తన నెక్స్ట్ మూవీని జగపతిబాబు బ్యానర్‌లో చేయబోతున్నాడు. మైత్రీ మూవీస్‌లో మౌళి తనూజ్, సాయి మార్తాండ్ ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
లిటిల్ హార్ట్స్ కథ ఏంటంటే?
అఖిల్ (మౌళి తనూజ్) ఎంసెట్‌లో ర్యాంక్ రాకపోవడంతో లాంగ్ టర్మ్ కోసం ఓ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవుతాడు. అక్కడే అతడికి కాత్యాయని (శివానీ నాగారం) పరిచయం అవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. కానీ కాత్యాయనికి సంబంధించిన ఓ సీక్రెట్ వారి ప్రేమకు అడ్డుగా మారుతుంది? అదేమిటి? అఖిల్, కాత్యాయని ఒక్కటయ్యారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.


