Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభLOKAH CHAPTER: లోక చాప్టర్ 2 అనౌన్స్‌మెంట్ తో మలయాళ బాక్సాఫీస్ షేక్ ?

LOKAH CHAPTER: లోక చాప్టర్ 2 అనౌన్స్‌మెంట్ తో మలయాళ బాక్సాఫీస్ షేక్ ?

LOKAH CHAPTER 1: ఈ రోజుల్లో సినిమా చిన్నదా, పెద్దదా అని జనాలు చూడట్లేదు. కంటెంట్ కొత్తదా, పాతదా అనేదే కీలకంగా మారింది. ఇటీవల బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను పరిశీలిస్తే, వాటిలో చాలా వరకు తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిన్న చిత్రాలే కావడం విశేషం.ఆ కోవలోనే మలయాళ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ‘లోక’ అనే చిత్రం అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద 250 కోట్లకు పైగా వసూలు చేసింది.

- Advertisement -

ఇందులో నటించిన ప్రేమలు ఫేమ్ హీరో నస్లెన్ మరియు మెయిన్ లీడ్‌లో చేసిన కళ్యాణి ప్రియదర్శన్ ఇద్దరూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, సూపర్ పవర్స్ ఉన్న పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ నటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమా కథాంశం, టేకింగ్‌తో పాటు ఇంత కొత్తగా అనిపించడానికి కారణం ఆ చిత్ర నిర్మాత దుల్కర్ సల్మాన్. ఆయన కేవలం హీరోగానే కాకుండా, నిర్మాతగా కూడా మలయాళీ సినీ పరిశ్రమకు ఒక అదిరిపోయే హిట్‌ని, ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని అందించాడు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/devara-2-confirmed-ntr-fans-celebrate/

CHAPTER 2 REVEAL : టోవినో థామస్ హీరోగా!
ఈ సినిమా చివర్లోనే దీనికి చాప్టర్ 2 కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే, అందులో ఒకరు టోవినో థామస్ అని చెప్పినప్పటికీ, మరొకరు ఎవరనేది సస్పెన్స్‌గా ఉంచారు. ఇప్పుడు ఆ సస్పెన్స్‌ను రివీల్ చేస్తూ, ‘లోక చాప్టర్ 2’ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు.ఈసారి దుల్కర్ సల్మాన్ కేవలం నిర్మాతగానే కాకుండా, ‘చార్లీ’ అనే ఒక సూపర్ హీరో పాత్రలో కూడా కనిపించబోతున్నాడు. ఈ వార్త విన్న సినీ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-and-sujeeth-latest-movie-og-ott-price/

‘లోక చాప్టర్ 2’ ఎంత కలెక్ట్ చేస్తుందనే దానికంటే, ఈసారి సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఈ ఒక్క అనౌన్స్‌మెంట్ వీడియోతో విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు, ‘లోక’ సిరీస్‌లో మొత్తం 5 చాప్టర్లు ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే, మలయాళ నటులతో పాటు మన తెలుగు హీరోలు కూడా ఎవరో ఒకరు ఈ ‘లోక చాప్టర్స్’లో భాగమయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad