DC: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇకపై నటుడిగా కూడా కనిపించబోతున్నాడు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలతో దర్శకుడిగా ఎంతో పేరు సంపాదించిన లోకేష్, ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. లోకేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘DC’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. లోకేష్ డైరెక్ట్ చేసిన ‘కూలీ’ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విశేషం ఏంటంటే, ‘కూలీ’ని నిర్మించిన సన్ పిక్చర్స్ బ్యానర్, లోకేష్ హీరోగా నటిస్తున్న ఈ ‘DC’ మూవీని కూడా నిర్మిస్తోంది. ఈ మూవీని (కెప్టెన్ మిల్లర్ ఫేమ్) అరుణ్ మాథేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
ALSO READ: Biker: శర్వానంద్ కొత్త ట్రాన్స్ఫర్మేషన్ ‘బైకర్’ గ్లింప్స్ రివ్యూ!
‘DC’ అనే టైటిల్ వెనుక ఉన్న విషయం ఏంటంటే, ఈ సినిమాలో లోకేష్ కనగరాజ్ పాత్ర పేరు ‘దేవదాస్’ (D), హీరోయిన్ వామికా గబ్బి పాత్ర పేరు ‘చంద్ర’ (C). ఈ రెండు పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ‘DC’గా పెట్టారు. తాజాగా విడుదలైన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. టీజర్‌లో లోకేష్ కనగరాజ్ ముఖం నిండా రక్తం, చేతిలో గన్‌తో చాలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. మరోవైపు హీరోయిన్ వామికా గబ్బి కూడా బాధగా, ఒక ఇంటెన్స్ లుక్ తో నడుచుకుంటూ రావడం కనిపించింది. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు మరింత హైప్‌ను తీసుకొచ్చింది. ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీగా ఉండబోతుంది అని తెలుస్తోంది.
దర్శకుడిగా లోకేష్ కనగరాజ్‌కు ఉన్న క్రేజ్ కారణంగా, తను హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక లోకేష్ కనగరాజ్, అనిరుధ్ కాంబినేషన్ గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ప్రతీ సినిమా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ మ్యాజిక్ ‘DC’కి కూడా కచ్చితంగా రిపీట్ అవుతుందని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాకుండా, డెబ్యూ హీరో అయిన లోకేష్‌కు జోడీగా, అందం, అభినయం కలగలిసిన వామికా గబ్బి నిలవడం ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్.
ALSO READ: Aadi Saikumar: ఆది సాయికుమార్ ‘శంబాల’ ట్రైలర్ రివ్యూ!
లోకేష్ కనగరాజ్ ఒకపక్క ‘DC’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తూనే, మరోవైపు తన డ్రీమ్ ప్రాజెక్ట్, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అయిన ‘ఖైదీ 2’ డైరెక్షన్ పనులను కూడా స్టార్ట్ చేసేసాడు. ఈ ‘DC’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ‘ఖైదీ 2’ విషయం పక్కన పెడితే, లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.


