Lokesh Kanagaraj: రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. రిలీజ్‌కు ముందు కూలీపై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తొలి సినిమా కావడంతో పాటు టాలీవుడ్ అగ్ర నటుడు నాగార్జున విలన్‌గా నటించడం, బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ గెస్ట్ రోల్ చేయడం.. సౌబీన్ షాహిర్, ఉపేంద్ర వంటి స్టార్లు ఈ సినిమాలో భాగం కావడంతో కూలీ కోసం అన్ని భాషల ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ రొటీన్ స్టోరీ లైన్ కారణంగా ఆ అంచనాలను అందుకోలేకపోయింది కూలీ. ఈజీగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందనుకున్న ఈ మూవీ ఐదు వందల కోట్లను అతి కష్టంగా చేరుకుంది. సినిమా రిలీజై ఇరవై రోజులు అవుతున్నా ఇప్పటికీ లాభాల్లోకి అడుగుపెట్టలేదు.
లోకేష్ టార్గెట్…
కూలీ రిజల్ట్ విషయంలో అందరి కంటే ఎక్కువగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌పైనే విమర్శలు వస్తున్నాయి. రజనీకాంత్, నాగార్జున వంటి స్టార్స్ ఇమేజ్‌కు తగ్గట్లుగా స్టోరీ రాసుకోవడంలో లోకేష్ విఫలమయ్యాడని ట్రోల్స్ వచ్చాయి. డైరెక్టర్‌గా లోకేష్ కనగరాజ్ పనైపోయిందని, కూలీ అతడి కెరీర్‌లోనే చెత్త సినిమా అంటూ నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.
ఎల్‌సీయూ అని చెప్పలేదు…
ఈ విమర్శలపై లోకేష్ కనగరాజ్ రియాక్ట్ అయ్యారు. కూలీ రిజల్ట్ విషయంలో ఆడియెన్స్ ఏవేవో ఊహించుకొని డిజపాయింట్ అయ్యారని అన్నాడు. ‘కూలీ సినిమా ఎల్‌సీయూలో భాగమని, ట్రైమ్ ట్రావెల్ స్టోరీ అంటూ ఆడియెన్స్ ఊహించేసుకున్నారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనే సినిమాను చూశారు. వారు అనుకున్నవేవి కథలో లేకపోవడంతో చాలా మంది ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. కూలీకి ఎల్‌సీయూతో లింక్ ఉంటుందని, ఇది ట్రైమ్ ట్రావెల్ స్టోరీ అని నేను ఎప్పుడు, అక్కడ చేప్పలేదు’ అని లోకేష్ కనగరాజ్ అన్నారు. ఆడియెన్స్ అంచనాలకు తగ్గట్లుగా కథలను ఇప్పటివరకు తాను రాయలేదని. ఇకపై కూడా రాయనని అన్నారు.
వందల కోట్లు రాబడితేనే సినిమా సక్సెస్ అయినట్లు అనే మాటలను తాను నమ్మనని, అన్ని అలాంటి సినిమాలే చేయడం ఏ ఫిల్మ్ మేకర్‌కు సాధ్యపడదని లోకేష్ కనగరాజ్ చెప్పాడు. కొన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్‌కు మించి గౌరవాన్ని, విలువను తీసుకొస్తాయని పేర్కొన్నాడు. లోకేష్ కనగరాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
డైరెక్షన్‌కు గ్యాప్…
కూలీ తర్వాత డైరెక్షన్‌ను కొన్నాళ్లు గ్యాప్ ఇవ్వబోతున్నాడు లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. లోకేష్ కనగరాజ్ డెబ్యూ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రచితారామ్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూలీ మూవీలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో రచితారామ్ కనిపించింది.


