శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) హైదరాబాద్ విచ్చేశారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ(Jishnu Dev Varma), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరణ అనంతరం అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ బొల్లారం(Bollaram)లోని రాష్ట్రపతి నిలయానికి ఆమె వెళ్లారు.
ఈ నెల 21 వరకు బొల్లారంలో ద్రౌపది ముర్ము ఉండనున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే శుక్రవారం ఎట్ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు.
అంతకుముందు ఏపీలోని మంళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో భాగంగా సుమారు 49 ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎంబీబీఎస్ పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట చేరుకున్నారు.