Friday, January 31, 2025
Homeచిత్ర ప్రభHari Hara Veera Mallu: 'మాట వినాలి' పాట‌ను ప‌వ‌న్ కళ్యాణ్‌ ఎలా పాడారో చూసేయండి..

Hari Hara Veera Mallu: ‘మాట వినాలి’ పాట‌ను ప‌వ‌న్ కళ్యాణ్‌ ఎలా పాడారో చూసేయండి..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు'(Hari hara Veera mallu) చిత్రంలోని ‘మాట వినాలి'(Maata Vinali) సాంగ్‌ను ఇటీవల చిత్ర బృందం విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడిన ఈ పాట‌కు విశేష స్పందన వచ్చింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

- Advertisement -

‘మాట వినాలి.. గురుడా మాట వినాలి.. మాట వినాలి.. మంచి మాట వినాలి’ అంటూ ప‌వ‌న్ కళ్యాణ్ పాడేట‌ప్పుడు తీసిన వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ‘మాట వినాలి’ బీటీఎస్ అంటూ ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ప‌వ‌న్ ఎంతో ఉత్సాహంగా, జోష్‌తో ఈ పాట పాడారు. ఎంతో సరదా వాతావరణంలో సాగిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది.

కాగా ఈ మూవీ మేజర్ పార్ట్‌ని ఇప్పటికే ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన దర్శకత్వం నుంచి తప్పించుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మిగిలిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పవన్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్య మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇక ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మార్చి 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News