ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో 2023లో విడుదలైన ‘మ్యాడ్’ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందించిన మ్యాడ్ స్క్వేర్'(MAD Square) మార్చి 28న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. దీంతో బాక్సాపీస్ వద్ద మీడియం రేంజ్ హీరోల సినిమాలను తలదన్నేలా వసూళ్లు దక్కించుకుంది. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇక ఈ సినిమాలో సునీల్, సత్యం రాజేష్,ప్రియాంక జవాల్కర్, అనుదీప్, రెబా మోనికా జాన్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీని సితార ఎంటర్ టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మించారు. ఇక కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా..ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.