ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో 2023లో విడుదలైన ‘మ్యాడ్’ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందించిన మ్యాడ్ స్క్వేర్'(MAD Square) మార్చి 28న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. సినిమా మొత్తం ఫుల్ కామెడీగా ఉండటంతో ఆడియన్స్ మూవీ చూసేందుకు ఎగబడుతున్నారు. దీంతో ఫస్ డే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. మీడియం రేంజ్ హీరోల సినిమాలను తలదన్నేలా వసూళ్లు దక్కించుకుంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.20.08కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు బ్లాక్‌బాస్టర్ మ్యాక్స్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేసింది.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ మూవీని సితార ఎంటర్ టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మించారు. ఇక కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా..ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
