Hero Madhavan : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆర్. మాధవన్ మళ్లీ లఢఖ్‌లో చిక్కుకుపోయాడు! ఈసారి కారణం భారీ వర్షాలు. నాలుగు రోజులుగా అవిశ్రాంతంగా కురుస్తున్న వానలతో లేహ్ విమానాశ్రయం రన్‌వే మూసివేశారు. దీంతో విమానాలు రద్దయ్యాయి, మాధవన్ ఇంటికి తిరిగి వెళ్లలేక హోటల్‌లోనే ఉండిపోయాడు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిన్న వీడియోతో పంచుకున్నాడు. హోటల్ రూమ్ నుంచి మంచుతో నిండిన పర్వతాలు, మబ్బులు కమ్మిన ఆకాశాన్ని చూపిస్తూ మాట్లాడాడు.
ALSO READ: Mirai Movie : తేజ సజ్జ ‘మిరాయ్’ ట్రైలర్ విడుదల.. సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్
“ఆగస్టు చివర్లోనే లఢఖ్ పర్వతాలపై మంచు పడుతోంది. నాలుగు రోజులుగా నిరంతర వర్షం కారణంగా విమానాశ్రయాలు మూసేశారు. లఢఖ్‌కు షూటింగ్ కోసం వచ్చిన ప్రతిసారీ ఇలానే జరుగుతుంది” అని చెప్పాడు మాధవన్. ఇది 17 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందట. 2008లో ‘3 ఇడియట్స్’ సినిమా షూటింగ్ కోసం పంగాంగ్ లేక్ వద్దకు వచ్చినప్పుడు, ఆగస్టులోనే అకస్మాత్తుగా మంచు కురిసి విమానాలు ఆగిపోయాయట. ఆ సమయంలో మొత్తం టీమ్ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. “అయినా, ఈ ప్రాంతం ఎప్పుడూ అద్భుతంగా అందంగా ఉంటుంది. ఆకాశం క్లియర్ అయితే విమానాలు ల్యాండ్ అవుతాయని, ఇంటికి తిరిగి వెళ్తానని ఆశిస్తున్నా” అని క్యాప్షన్ ఇచ్చాడు. “లేహ్‌లో మళ్లీ చిక్కుకుపోయా.. విమానాలు లేవు. 17 ఏళ్ల తర్వాత వర్షం” అంటూ ఎమోజీలతో పోస్ట్ చేశాడు.
మాధవన్ లఢఖ్‌తో ఉన్న బంధం ఇలాంటి సంఘటనలతో మరింత బలపడుతోంది. ఆయన చార్మింగ్ స్మైల్, టాలెంట్‌తో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవల ‘షైతాన్’ వంటి హిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాబోయే ప్రాజెక్టులు ‘ఆప్ జైసా కోయి’, ‘ధురంధర్’ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. లఢఖ్ అందాలు ఆయన్ను వదలనివ్వట్లేదని అభిమానులు జోకులు వేస్తున్నారు. మాధవన్ త్వరలోనే సేఫ్‌గా ఇంటికి చేరుకోవాలని కోరుకుందాం!


