Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభMadhur Bhandarkar : బాలీవుడ్ రీమేక్ సినిమాలపై స్టార్ డైరెక్టర్ వ్యాఖ్యలు..

Madhur Bhandarkar : బాలీవుడ్ రీమేక్ సినిమాలపై స్టార్ డైరెక్టర్ వ్యాఖ్యలు..

- Advertisement -

Madhur Bhandarkar : ఇటీవల బాలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు అన్ని వరుస ఫ్లాప్స్ అయి బాలీవుడ్ కి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇక బాలీవుడ్ వాళ్ళు వరుసగా రీమేక్ సినిమాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ లో హిట్ అయిన సినిమాలని బాలీవుడ్ లో వరుసగా రీమేక్స్ చేస్తున్నారు. వాటిలో కూడా చాలా వరకు ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ బాలీవుడ్ రీమేక్ సినిమాలపై బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో చాందిని బార్, ఫ్యాషన్, హీరోయిన్, బబ్లీ బౌన్సర్ లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ ఇటీవల ‘ఇండియా లాక్‌డౌన్‌’ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ చేస్తున్న రీమేక్ సినిమాలపై సీరియస్ కామెంట్స్ చేశారు మధుర్ భండార్కర్.

మధుర్ భండార్కర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడి సినిమాలైనా ప్రేక్షకులు ఓటీటీ ద్వారా చూస్తున్నారు. వాళ్ళు అన్ని రకాల సినిమాలు చూస్తున్నారు. వేరే భాష సినిమాలు కూడా వారు అర్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రీమేక్ సినిమాలు చేయడం అనవసరం. బాలీవుడ్ ఇకనైనా రీమేక్ సినిమాలు ఆపేసి ఒరిజినల్ కంటెంట్ పై దృష్టి పెట్టాలి అని అన్నారు. దీంతో మధుర్ భండార్కర్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చగా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News