Mahavatar Narasimha Collections: మైథలాజికల్ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా అదిరిపోయే కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. థియేటర్లలోకి వచ్చి ఏడు రోజులు అయినా ఈ సినిమా జోరు తగ్గడం లేదు. రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. శుక్రవారం నాటితో మహావతార్ నరసింహా మూవీ యాభై కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. తెలుగుతో పాటు హిందీలో షాకింగ్ కలెక్షన్స్ రాబడుతోంది.
53 కోట్ల కలెక్షన్స్…
ఏడు రోజుల్లో అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్‌గా మహావతార్ నరసింహా మూవీ 53 కోట్ల గ్రాస్, 26 కోట్ల షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నది. అత్యధికంగా హిందీ వెర్షన్ 37 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది. ఈ మూవీతో నార్త్ థియేటర్లు మొత్తం ఊగిపోతున్నాయి. హిందీ తర్వాత తెలుగులో మహావతార్ నరసింహాకు అత్యధిక కలెక్షన్స్ రావడం గమనార్హం.
Also Read – Venkatesh – Rana: కోర్టు విచారణకు దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా – కారణం ఏమిటంటే?
తెలుగులో…
తెలుగులో ఈ సినిమాకు ఏడు రోజుల్లో 13 కోట్ల కలెక్షన్స్‌తో కుమ్మేసింది. గురువారం కింగ్డమ్ పోటీని తట్టుకొని రెండు కోట్ల యాభై లక్షలకుపైగా గ్రాస్, కోటి ముప్పై లక్షల షేర్ కలెక్షన్స్‌ను మహావతార్ నరసింహా సొంతం చేసుకున్నది. కింగ్డమ్ మినహా మరో పెద్ద సినిమా ఏది థియేటర్లలో లేకపోవడం మహావతార్ నరసింహాకు కలిసివచ్చింది. వీకెండ్‌లోనూ ఈ సినిమా జోరు చూపించే అవకాశం ఉందని అంటున్నారు.
వణికిస్తోంది…
బాక్సాఫీస్ వద్ద హరిహరవీరమల్లు, కింగ్డమ్, సన్నాఫ్ సర్ధార్ లాంటి స్టార్ హీరోల సినిమాలను సైతం మహావతార్ నరసింహా వణికిస్తోంది. బుక్‌మై షో టికెట్ బుకింగ్ యాప్‌లో లాస్ట్ వన్ అవర్‌లో కింగ్డమ్ టికెట్స్ 7.93 కే అమ్ముడుపోగా… సన్నాఫ్ సర్ధార్ 7.53కే కు పరిమితమైంది. మహావతార్ నరసింహా టికెట్స్ మాత్రం గంటలో 18.16 కే అమ్ముడుపోవడం బాక్సాఫీస్ వర్గాలను విస్మయపరుస్తోంది.
Also Read – August 2025 Movies: ఆగస్ట్ బాక్సాఫీస్ భామలు..!
సలార్ ప్రొడక్షన్‌లో…
కేజీఎఫ్, సలార్ వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మస్ సంస్థ మహావతార్ నరసింహా సినిమాను నిర్మించింది. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన మొదటి సినిమా ఇది. ఇందులో నరసింహావతారాన్ని చూపించారు. పరశురామ రఘునందన్, గోకులానందతో పాటు మిగిలిన భాగాలను కూడా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మహావతార్ నరసింహా సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించాడు.


