Mahavatar Narsimha: మహావతార్ నరసింహా థియేటర్లలో రిలీజై నలభై రోజులు దాటినా కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మైథలాజికల్ యానిమేషన్ మూవీ ఇప్పటికీ హౌజ్‌ఫుల్స్‌తో థియేటర్లలో ఆడుతోంది. మూడు వందల కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి చరిత్రను సృష్టించింది. ఓవరాల్‌గా నలభై ఏడు రోజుల్లో 324 కోట్ల వసూళ్లను రాబట్టింది.
స్టార్ హీరోల సినిమాలు…
ఈ యానిమేషన్ మూవీ ధాటికి స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయి. తెలుగులోనే కాకుండా హిందీలో కలెక్షన్లతో అదరగొడుతోంది. తాజాగా మహావతార్ నరసింహా మూవీ బాలీవుడ్‌లో మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది.
Also Read – Kerala High Court : విటుడు వినియోగదారుడు కాదు… వ్యభిచారంపై కేరళ హైకోర్టు సంచలన తీర్పు!
అక్షయ్, సల్మాన్ కలెక్షన్స్ బ్రేక్…
కలెక్షన్స్‌లో అక్షయ్‌కుమార్, సల్మాన్ ఖాన్ సూపర్ హిట్స్ మూవీని మహావతార్ నరసింహా దాటేసింది. టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ మూవీ థియేటర్లలో 316 కోట్ల వసూళ్లను దక్కించుకున్నది. అక్షయ్ కుమార్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాగా నిలిచింది. టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ కథ కలెక్షన్స్‌ను మహావతార్ నరసింహా దాటేసి సంచలనం సృష్టించింది. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఏక్ థా టైగర్ మూవీ కలెక్షన్స్‌ను కూడా మహావతార్ నరసింహా బ్రేక్ చేయడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయ పరుస్తోంది. ఎక్ థా టైగర్ ఫుల్ థియేట్రికల్ రన్‌లో 320 కోట్ల వసూళ్లను దక్కించుకున్నది. 47 రోజుల్లోనే సల్మాన్ మూవీ కలెక్షన్స్‌ను ఈ యానిమేషన్ మూవీ క్రాస్ చేసింది.
హిందీలో అదుర్స్…
మహావతార్ నరసింహా దక్షిణాది భాషల్లో కంటే హిందీలోనే ఎక్కువగా వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా హిందీ వెర్షన్ 188 కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్నది. హిందీ తర్వాత తెలుగులోనే ఈ మూవీ పెద్ద హిట్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్‌కు 49 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మిగిలిన భాషల్లో మాత్రం మహావతార్ నరసింహా కలెక్షన్ల పరంగా అంచనాలను అందుకోలేకపోయింది.
అశ్విన్ కుమార్ డైరెక్టర్…
మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మహావతార్ నరసింహా మూవీకి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించాడు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. కేవలం నలభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నిర్మాతలకు లాభాల పంటను పడించింది. మహా విష్ణువు నరసింహా అవతారం ఆధారంగా ఈ మూవీ రూపొందింది.
Also Read – KTR: గోపీనాథ్ ఉండి ఉంటే కాంగ్రెస్ ఆటలు సాగకపోవు!


