Mahavatar Narsimha: బాక్సాఫీస్ వద్ద మైథలాజికల్ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా ప్రభంజనం కొనసాగుతోంది. ఈ సినిమా రిలీజై రెండు వారాలు దాటినా కలెక్షన్స్ జోరు మాత్రం తగ్గడం లేదు. మూడు వందల కోట్ల దిశగా ఈ యానిమేషన్ మూవీ దూసుకుపోతుంది. హిందీతో పాటు తెలుగు వెర్షన్ భారీగా వసూళ్లను రాబడుతోన్నాయి.
220 కోట్ల వరకు…
19 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా మహావతార్ నరసింహా మూవీ 220 కోట్ల వరకు వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు ఇటీవల మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. హిందీలో ఈ యానిమేషన్ మూవీ కలెక్షన్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. కేవలం హిందీ వెర్షన్ పంతొమ్మిది రోజుల్లో 134.50 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. మంగళవారం రోజు హిందీలో మహవతార్ నరసింహా మూవీకి 4.30 కోట్ల వరకు కలెక్షన్స్ రావడం గమనార్హం.
40 కోట్లు…
హిందీ తర్వాత తెలుగులోనే మహావతార్ నరసింహా మూవీ ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు వెర్షన్ ఇప్పటివరకు 40 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా నిర్మాతలకు ఈ మూవీ ఈ మూవీ ట్రిపుల్ ప్రాఫిట్స్‌ను తెచ్చిపెట్టింది.
అసలు బడ్జెట్ ఎంతంటే?
కాగా మహావతార్ నరసింహా అసలు బడ్జెట్‌ను డైరెక్టర్ అశ్విన్ కుమార్ రివీల్ చేశాడు. ఈ సినిమా మేకింగ్‌కు పదిహేను కోట్ల వరకు ఖర్చయినట్లు డైరెక్టర్ పేర్కొన్నాడు. ప్రమోషన్స్‌తో కలిసి ఈ యానిమేషన్ మూవీ మొత్తం బడ్జెట్ 40 కోట్ల వరకు అయ్యిందట. ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తుందని, రెండు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబడుతుందని అస్సలు ఊహించలేదని అశ్విన్ కుమార్ పేర్కొన్నారు. యానిమేషన్ సినిమాలు అంటే కేవలం పిల్లల కోసమే అనే ఆలోచనను మహావతార్ నరసింహా మార్చేసిందని అన్నారు. మరిన్ని యానిమేషన్ సినిమాల రూపకల్పనకు ఈ విజయం స్ఫూర్తిగా నిలిచిందని తెలిపాడు. ఇండియన్ యానిమేషన్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా మహావతార్ నరసింహా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ది లయన్ కింగ్ మూవీ రికార్డ్‌ను బ్రేక్ చేసింది.
దశావతారాల్లో ఒకటిగా…
కెజియఫ్, సలార్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ మహావతార్ నరసింహా సినిమాను ప్రొడ్యూస్ చేసింది. అశ్విన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విష్ణు దశావతారాల్లో ఒకటైన నరసింహావతారం కథాంశంతో ఈ మూవీ రూపొందింది. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడటం కోసం శ్రీ మహా విష్ణువు.. నరసింహా అవతారాన్ని ఎత్తి హిరణ్యకశ్యపుడిని ఎలా అంతమొందించాడన్నదే ఈ మూవీ కథ.
Also Read- Amaravati : అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి.. శంకుస్థాపన చేసిన బాలకృష్ణ


