Mahavatar Narsimha: మైథలాజికల్ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇండియన్ యానిమేషన్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా మహావతార్ నరసింహా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
హరిహర వీరమల్లుకు పోటీగా…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మహావతార్ నరసింహాకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ కింగ్డమ్ సైతం పోటీ ఇవ్వలేకపోయాయి. మహావతార్ నరసింహా, హరిహర వీరమల్లు రెండు సినిమాలు ఒకే రోజు రిలీజయ్యాయి. పదమూడు రోజుల్లో హరిహర వీరమల్లుకు 113 కోట్ల కలెక్షన్స్ రాగా… మహావతార్ నరసింహా 120 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. హిందీతో పాటు తెలుగులో ఈ యానిమేషన్ మూవీ భారీగా కలెక్షన్స్ రాబడుతోంది.
Also Read – Indian Economy : ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు యథాతథం!
ఓటీటీలోకి…
మహావతార్ నరసింహా ఓటీటీలోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా సెప్టెంబర్‌లోనే ఈ యానిమేషన్ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ క్లీమ్ ప్రొడక్షన్స్ రియాక్ట్ అయ్యింది.
“మహావతార్ నరసింహా మూవీ ప్రస్తుతానికైతే థియేటర్లలోనే స్క్రీనింగ్ అవుతుంది. మేము ఓటీటీ సంస్థతో డీల్ కుదుర్చుకోలేదు. సెప్టెంబర్‌లో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు” అని పేర్కొన్నారు. మహావతార్ నరసింహా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి మా అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వచ్చే అప్‌డేట్స్‌ను మాత్రమే నమ్మండి అంటూ ట్వీట్ చేసింది.
దశావతారాలు…
మహావతార్ నరసింహా సినిమాను క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి కన్నడ దిగ్గజ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ యానిమేషన్ మూవీకి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడటానికి విష్ణు దేవుడు… నరసింహా అవతారాన్ని ఎలా ఎత్తాడనే కాన్సెప్ట్‌తో మహావతార్ నరసింహా మూవీ రూపొందింది. విష్ణువు దశావతారాలతో సినిమాలు చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మహావతార్ నరసింహా తర్వాత పరశురామ అవతార్ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో పెద్ద విజయాలను అందుకున్నది హోంబలే ఫిల్మ్స్ సంస్థ.
Also Read – Peddi: శ్రీలీల ఐటమ్ సాంగ్… అరుపులే


