Mahavatar Narsimha OTT: ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పిన డివోషనల్, యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సినిమాను సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12.30 నిమిషాలకు స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. ‘మహావతార్ నరసింహ’ పోస్టర్‌ను షేర్ చేసింది.

మహా విష్ణువు దశావతారాల ఆధారంగా ‘మహావతార్’ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో తొలి చిత్రంగా వచ్చిన ‘నరసింహ’ మూవీకి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్ సమర్పణలో శిల్పా ధావన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా నిర్మించారు. జులై 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఊహించని రీతిలో కలెక్షన్లు రాబట్టింది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టగా.. ఇప్పటివరకు రూ. 340 కోట్లకి పైగా కలెక్షన్లతో రికార్డు క్రియేట్ చేసింది.


