Mahesh and Rajamouli: సూపర్‌స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతోన్న చిత్రం SSMB 29. ఈసారి పాన్ ఇండియా లెవల్లో కాదు.. పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఇండియన్ లాంగ్వెజెస్‌లో మాత్రమే కాకుండా ప్రపంచ భాషలతో పాటు అనేక దేశాల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అందుకు తగ్గట్లు ప్లానింగ్ కూడా జరుగుతోంది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 120 దేశాల్లో దీన్ని రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా షూటింగ్, ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ మూవీలో పలు భాషలకు చెందిన సూపర్ స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్లు ఇందులో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజ దర్శకులు పాల్గొననున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఇదంతా బాగానే ఉంది. అయితే సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవటం అనేది అభిమానులను, మూవీ లవర్స్‌ను ఎంతగానో బాధిస్తోంది. అయితే ఈ బాధ త్వరగానే తీరబోతోంది. ఎందుకంటే SSMB 29 టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయటానికి రాజమౌళి అండ్ టీమ్ భారీ ప్లానింగ్ చేస్తున్నారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు నవంబర్ 16న హైదరాబాద్‌లో ఈ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు. వేదికను త్వరలోనే ఫైనలైజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు కూడా న్యూస్ వినిపిస్తోంది.
Also Read- Dragon Movie: ప్రశాంత్ నీల్‌తో గొడవలు – డ్రాగన్‌ను పక్కనపెట్టిన ఎన్టీఆర్ – రూమర్స్ నిజమేనా?
ఇప్పటి వరకు సోషియో ఫాంటసీ టచ్‌తో సినిమాలు చేసిన రాజమౌళి SSMB 29 కోసం మరో లెవల్లో ఆలోచిస్తున్నాడు. సమాచారం మేరకు ఇందులో మహేష్‌బాబు రాముడిగా కనిపిస్తాడని అంటున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 అడ్వెంచరస్ యాక్షన్ మూవీ అయినా ఇందులో అంతర్లీనంగా మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయట. సినిమాలో శ్రీరాముడికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంటుందని చెబుతున్నారు. మహేష్‌బాబు రాముడిగా కనిపించే సీన్స్ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తాయని అంటున్నారు. రాక్షస సంహారం నేపథ్యంలో ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని సమాచారం. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం పౌరాణిక కాలాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేయబోతున్నట్లు తెలిసింది. రాక్షసులతో మహేష్‌బాబు తలపడే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందట.
SSMB 29లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో కేఎల్ నారాయణ మూవీని నిర్మిస్తున్నారు. 2027 ఆగస్ట్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read- Teja Sajja: స్టార్ హీరోలతో తేజ సజ్జా పోటీ.. సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండా ఓటీటీ డీల్ క్లోజ్


