Mahesh Babu: హీరోలంతా ఒక్కొక్కరుగా థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నారు. మల్టీప్లెక్స్‌లను ఓపెన్ చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి టాలీవుడ్ హీరోల్లో మొట్ట మొదట మహేష్‌బాబు అడుగుపెట్టారు. ఏఎంబీ పేరుతో గచ్చిబౌలిలో మహేష్‌బాబు ఓపెన్ చేసిన మల్టీప్లెక్స్ సినీ లవర్స్‌తో పాటు సెలిబ్రిటీలకు వినోదాన్ని పంచుతోంది. ప్రారంభమైన కొద్ది రోజులకే ఏఎంబీ చాలా ఫేమస్ అయ్యింది. బ్రాండ్‌గా మారిపోయింది. తాజాగా హైదరాబాద్‌లో మరో మల్టీప్లెక్స్‌ను మహేష్‌బాబు ఓపెన్ చేయబోతున్నారు. ఏఎంబీ క్లాసిక్ పేరుతో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో మహేష్‌బాబు రెండో మల్టీప్లెక్స్ మొదలుకానుంది.
ఏషియన్ సినిమాతో కలిసి మహేష్‌బాబు ఈ మల్టీప్లెక్స్ థియేటర్లను ప్రారంభించబోతున్నారు. పాత ఒడియన్ థియేటర్ స్థానంలో కొత్తగా ఈ ఏఎంబీ క్లాసిక్ లాంఛ్ కానుంది. ఏడు స్క్రీన్స్‌తో గ్రాండ్‌గా ఏఎంబీ క్లాసిక్ ఉంటుందని అంటున్నారు. ఆర్టిసీ క్రాస్‌రోడ్స్‌లో ఏఎంబీ క్లాసిక్ కూడా ఓ మెయిన్ థియేటర్‌గా మారనుందని సినీ లవర్స్ చెబుతున్నారు. డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్, 4కే లేజర్ ప్రొజెక్షన్ స్క్రీనింగ్‌తో సినీ లవర్స్‌ను మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఏఎంబీ క్లాసిక్ అందిస్తుందట.
Also Read- Rowdy Janrdhan: ఫ్లాప్ ప్రొడ్యూసర్‌తో మళ్లీ విజయ్ దేవరకొండ సినిమా.. డేట్ ఫిక్స్
చిరంజీవి సినిమాతో…
ఏఎంబీ క్లాసిక్ మల్టీప్లెక్స్ 2026 సంక్రాంతి నుంచి మొదలుకానున్నట్లు చెబుతున్నారు. మహేష్‌బాబు థియేటర్‌లో ఫస్ట్ మూవీగా మన శంకర వరప్రసాద్‌గారు స్క్రీనింగ్ చేయనున్నట్లు సమాచారం. సంక్రాంతి సినిమాలు కూడా ఏఎంబీ క్లాసిక్‌లో రిలీజ్ కానున్నాయి. ఇటీవలే రవితేజ ఏఆర్‌టీ సినిమాస్ పేరుతో హైదరాబాద్‌లోనే మల్టీప్లెక్స్ ప్రారంభించారు. అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ కూడా పెద్ద సక్సెస్ అయ్యింది. విజయ్ దేవరకొండ మహబూబ్‌నగర్‌లో మల్టీప్లెక్స్ థియేటర్ ప్రారంభించారు. వీరి బాటలోనే మరి కొందరు హీరోలు అడుగువేయబోతున్నట్లు సమాచారం.
గ్లోబ్ ట్రాటర్…
కాగా ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా టైటిల్‌తో పాటు మహేష్‌బాబు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ కానుంది. 2027లో ఈ గ్లోబ్ ట్రాటర్ మూవీ రిలీజ్ అవుతోంది. రాజమౌళి మూవీతోనే మహేష్‌బాబు పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
Also Read- Nora Fatehi: నోరా.. ఎద పొంగుల ఎర.. కుర్రకారు తట్టుకోవడం ఎలా?


