Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభKrishna : తండ్రి మృతిపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..

Krishna : తండ్రి మృతిపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్..

- Advertisement -

Krishna : ఇటీవల మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో సేవ చేసిన కృష్ణ మరణించడం ఆయన కుటుంబంతో పాటు తెలుగు పరిశ్రమకి తీరని లోటు. ముఖ్యంగా మహేష్ బాబుకి. ఒకే సంవత్సరంలో మహేష్ అన్న, తల్లి, తండ్రిలని కోల్పోయాడు. దీంతో మహేష్ చాలా బాధపడుతున్నాడు. ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదని అంతా కోరుకుంటున్నారు.

ఇటీవలే తండ్రి అస్థికలని మహేష్ బాబు కృష్ణా నదిలో కలిపి వచ్చారు. తాజాగా తన తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో మహేష్ ఎమోషనల్ పోస్ట్ చేసారు.

తన తండ్రి యువకుడిగా ఉన్నప్పటి ఫోటో షేర్ చేసి.. ”మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహాంగా గడిపారు. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ వ్యక్తిత్వం. మీలో నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి. నాకిప్పుడు ఎలాంటి భయం లేదు. కానీ ఇంతకుముందెన్నడూ లేని బలం నాలో ఉన్నట్లు అనిపిస్తుంది. మీ కాంతి నాలో ఎప్పటికి ప్రకాశిస్తూనే ఉంటుంది. మీ వారసత్వాన్ని నేను కొనసాగిస్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యు నాన్న. మీరు నా సూపర్ స్టార్” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. దీంతో మహేష్ తన తండ్రిని తలుచుకుంటూ రాసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News