Tuesday, April 8, 2025
Homeచిత్ర ప్రభMahesh Babu: షూటింగ్‌కు బ్రేక్.. రోమ్ వీధుల్లో మహేష్ ఫ్యామిలీ..!

Mahesh Babu: షూటింగ్‌కు బ్రేక్.. రోమ్ వీధుల్లో మహేష్ ఫ్యామిలీ..!

స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళితో చేస్తున్న భారీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు వస్తుందని అభిమానులు ఆతృతంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఇటీవల చిన్న బ్రేక్ వచ్చింది. ఈ గ్యాప్‌ను ఉపయోగించుకుని మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్‌కు వెళ్లారు.

- Advertisement -

మహేష్ బాబు ప్రస్తుతం తన భార్య నమ్రత శిరోద్కర్, కూతురు సితారతో కలిసి ఇటలీ రాజధాని రోమ్‌లో విహరిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో పాస్‌పోర్ట్ చూపిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా గతంలో మహేష్ రాజమౌళి సినిమా పూర్తయ్యే వరకు నా పాస్‌పోర్ట్ తీసేసుకున్నా అంటూ హ్యూమరస్‌గా ఒక పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే షూటింగ్ నడుస్తున్నంతకాలం ఆయన వెకేషన్‌కు వెళ్లరని అందరూ భావించారు.

ఇక తాజాగా నమ్రత, సితారలు రోమ్ వీధుల్లో ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీటిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ప్రత్యేకించి మహేష్ బాబు నుంచి ఎప్పుడైనా కొత్త ఫోటోలు వస్తాయేమో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇటలీలో ప్రస్తుతం చల్లటి వాతావరణం ఉండటంతో.. మహేష్ ఫ్యామిలీ అక్కడి రిలాక్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ అడ్వెంచర్ ఫాంటసీ మూవీ షూటింగ్ ఏప్రిల్ 15 తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకమైన లుక్‌ను కూడా ట్రై చేస్తున్నాడట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News