Teja Sajja: తెలుగు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా హీరోగా మారి ‘హనుమాన్’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీని తెచ్చుకున్నాడు. ఈ సినిమాకి ముందు ఓ బేబి లాంటి సినిమాలు చేసి కూడా పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక తేజ సజ్జా నటించిన లేటెస్ట్ సినిమా ‘మిరాయ్’. మరోసారి సోషియో ఫాంటసి కథతో వస్తున్న ఈ యంగ్ హీరో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 12న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ.. రాజమౌళి-మహేశ్ ల ఎస్ఎస్ఎంబి29 సినిమా ప్రస్తావన తీసుకు వచ్చాడు. దీనిలో భాగంగా ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ గా పిలుస్తున్న పేరును తప్పుగా చెప్పాడు. ఎస్ఎస్ఎంబి29 కి బదులుగా ఎస్ఎస్ఆర్ఎంబి29 గా పలికాడు. దాంతో మహేశ్ ఫ్యాన్స్‌కి కోపం వచ్చింది. సినిమా పేరును ఇలా తప్పుగా పలకడం ఏంటీ అని తేజ సజ్జా మీద మండిపడుతున్నారు.
Also Read- Bigg Boss: తొలివారం నామినేషన్స్‌లో 9 మంది.. సామాన్యుల నుంచి పడాల, భరణి సేఫ్..!
అంతేకాదు, బాయ్‌కాట్ మిరాయ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఓ న్యూస్‌ని సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ అనుకున్నప్పటి నుంచి ఇదే టైటిల్‌తో వార్తలు వస్తున్నాయి. పలు శాటిలైట్ ఛానళ్ళలోనూ ఇలాగే పిలుస్తున్నారు. అలాంటిది తేజ ఇలా తప్పుగా మాట్లాడటం మహేశ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చెప్పాలంటే ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద వారే జరుగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. గత సంక్రాంతికి మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జా నటించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.
అయితే, మహేశ్-త్రివిక్రమ్‌ల గుంటూరు కారం యావరేజ్ టాక్ తెచ్చుకుంటే, ప్రశాంత్ వర్మ-తేజ సజ్జా ల హనుమాన్ మాత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాతే పాన్ ఇండియా వైడ్‌గా తేజ కి మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు వస్తోన్న మిరాయ్ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. బాక్సాఫీస్ వద్ద గట్టిగానే వసూళ్ళు రాబడుతుందని ఆల్రెడీ చెప్పుకుంటున్నారు. ఇప్పటికే, బిజినెస్ కూడా జరిగి ప్రాఫిట్‌లోకి వచ్చేశారని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో తేజ సజ్జా ఎస్ఎస్ఎంబి29 పేరును తప్పుగా చెప్పి చిక్కులు తెచ్చుకున్నట్టైంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read- Darshan: జైల్లో ఉండలేకపోతున్నా విషమివ్వండి.. జడ్జినే రిక్వెస్ట్ చేసిన నటుడు దర్శన్


