Little Hearts: చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజై సంచలన విజయాన్ని సాధించింది. కేవలం రెండు కోట్ల నలభై లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఏకంగా 32 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. ఆడియెన్స్ మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు సైతం ఈ చిన్న సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రవితేజ, నానితో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు లిటిల్ హార్ట్స్ సినిమాను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.
మహేష్‌బాబు కూడా…
లిటిల్ హార్ట్స్ మూవీ ఫ్యాన్స్ లిస్ట్‌లో టాలీవుడ్ అగ్ర హీరో మహేష్‌బాబు కూడా చేరారు. లిటిల్ హార్ట్స్ సినిమా చూసిన ఇంప్రెస్ అయ్యారు మహేష్‌బాబు. టీమ్‌ను అభినందిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. లిటిల్ హార్ట్స్ చాలా బాగుందని, సినిమా చూసి ఎంజాయ్ చేశానని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సింజీత్‌ను ఉద్దేశించి తన ట్వీట్‌లో ఫన్నీగా కామెంట్ పెట్టారు మహేష్‌బాబు.
లిటిల్ హార్ట్స్ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో ఆద్యంతం సరదాగా ఉంది. యంగ్ టీమ్ అందరూ అద్భుతంగా నటించారు. ఫన్ రైడ్‌లా సినిమా సాగిపోయింది అని మహేష్‌బాబు అన్నారు. అంతే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ సింజీత్‌ను ఉద్దేశించి నువ్వు ఫోన్ ఆపేసి ఎక్కడికి వెళ్లొద్దు బ్రదర్. మరికొద్ది రోజుల్లో నువ్వు చాలా బిజీగా మారిపోతావ్ అంటూ మహేష్‌బాబు పేర్కొన్నారు. లిటిల్ హార్ట్స్ టీమ్ అందరికి కంగ్రాట్స్ చెప్పారు.
Also Read – September 17: విమోచనమా? విలీనమా? తెలంగాణ చరిత్రాత్మక పోరాటం!
అస్సలు ఊహించలేదు…
మహేష్‌బాబు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ నుంచి ఇలాంటి ట్వీట్ అస్సలు ఊహించలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్‌కు ఇది జెర్సీ మూమెంట్ అని అంటున్నారు. ట్వీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ఆరు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి.
మహేష్ ఫ్యాన్…
కాగా మ్యూజిక్ డైరెక్టర్ సింజీత్ మహేష్‌బాబుకు వీరాభిమాని. లిటిల్ హార్ట్స్ ప్రమోషన్స్‌లో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. లిటిల్ హార్ట్స్ గురించి మహేష్‌బాబు ట్వీట్ పెడితే తాను సంతోషంగా ఫీలవుతానని, ఆ ఆనందంలో ఫోన్ స్విఛాఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్లిపోతానని అన్నాడు. అతడి మాటలను ఉద్దేశిస్తూ మహేష్‌బాబు ఫన్నీగా ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు చెబుతోన్నారు.
లిటిల్ హార్ట్స్ మూవీలో మౌళి తనూజ్, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా నటించారు. సాయిమార్తాండ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
Also Read – Chandrababu: ఏపీలో బెల్ట్ షాపులు ఇక కన్పించవు.. వందశాతం డిజిటల్ చెల్లింపులే.. సీఎం బాబు కీలక నిర్ణయం


