కొంతమంది ప్రముఖులు తమకు ఎంతో పేరు, సంపాదన తెచ్చిపెట్టిన అభిమానులకు తిరిగి ఎంతో కొంత ఇవ్వాలని అనుకుంటారు. అందుకోసం వివిధ మార్గాలను ఎంచుకుంటారు. కొందరు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తారు. మరికొందరు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాంటి కోవలోకే సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) వస్తారు. తాను సమాజానికి ఎంతో సేవ చేస్తూ కూడా పబ్లిసిటీ కూడా చేసుకోరు. ఆపదలో ఉన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఉంటారు. ఇలా ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు కాపాడారు.
ఇప్పటివరకు 4500 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించారు.ఈ విషయాన్ని విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏపీలో మదర్స్ మిల్క్ బ్యాంక్‌తో పాటు బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ టీకాను అందించే కార్యక్రమాన్ని నమ్రత ప్రారంభించారు. ఇంతమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించారనే వార్త తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నువ్వు నిజంగా దేవుడివి సామి అంటూ మహేశ్ బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంలో మహేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.