Maheshbabu :టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ఆగస్టు 9, 2025న తన 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇక మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ లో సైతం కనిపించారు. టాలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరుగా ఉన్నారు. మరి ఆయన నెట్వర్త్ ఎంతో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
మహేశ్ బాబు నెట్ వర్త్ 2025 నాటికి సుమారు 300-350 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఈ సంపద సినిమా రెమ్యూనరేషన్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వ్యాపార వెంచర్లు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నుంచి వస్తుంది.
ALSO READ : Marokkasari Look: ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా మరొక్కసారి.. ఇండియన్ మూవీస్‌లో ఇదే ఫస్ట్
మహేశ్ బాబు సినిమా ఒక్కొక్కటికి 60-100 కోట్ల రూపాయలు వసూలు చేస్తారు, అదనంగా లాభాల్లో వాటా కూడా పొందుతారు. థమ్స్ అప్, మైంట్రా, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ బ్రాండ్ల ఎండార్స్‌మెంట్స్ ద్వారా సంవత్సరానికి 15-20 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఆయనకు జీ. మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్, మల్టీప్లెక్స్ చైన్‌లు, రెస్టారెంట్లలో పెట్టుబడులు విస్తృత ఆదాయ వనరులను అందిస్తాయి.
హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో 30 కోట్ల విలువైన లగ్జరీ మాన్షన్, గోవా, బెంగళూరు, చెన్నైలో విలాసవంతమైన ఆస్తులు ఆయన సంపదలో భాగం. రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్-బెంజ్ GLS 600 మయ్‌బాక్, ఆడి ఈ-ట్రాన్ వంటి లగ్జరీ కార్ల కలెక్షన్స్ మహేశ్ బాబు విలాసవంతమైన జీవనశైలికి నిదర్శనం.
ALSO READ : Tollywood Heroes: గేరు మార్చిన టాలీవుడ్ హీరోలు -వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్న స్టార్స్!
సామాజిక సేవలోనూ మహేశ్ ముందుంటారు. ఆయన ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చిన్నారుల గుండె శస్త్రచికిత్సలు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు విరాళాలు అందిస్తారు. మహేశ్ బాబు సంపద, కష్టపడి సాధించిన విజయం, సామాజిక బాధ్యతలు ఆయన్ను నిజమైన శ్రీమంతుడిగా నిలబెట్టాయి.


