Mahesh Babu: ప్రస్తుతం టాలీవుడ్ సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు పార్ట్2ను అనౌన్స్ చేయడం కామన్‌గా మారింది. అఖండ 2, కల్కి సీక్వెల్, దేవర 2, గూఢచారి 2.. ఇలా పలు సీక్వెల్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్నాయి. సీక్వెల్స్‌తో పాటు రీమేక్‌లను సక్సెస్‌కు దగ్గరిదారిగా చెబుతుంటారు. రీమేక్‌లతో బ్లాక్‌బస్టర్స్ అందుకున్న స్టార్ హీరోలు తెలుగులో చాలా మందే ఉన్నారు.
హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఆరేళ్లు అవుతున్న ఓ టాలీవుడ్ టాప్ హీరో మాత్రం ఇప్పటివరకు ఒక్క రీమేక్, సీక్వెల్ సినిమా చేయలేదు. ఆ హీరో ఎవరో కాదు మహేష్‌బాబు.
హిట్టయ్యాయి…
1999లో రిలీజైన రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మహేష్‌బాబు. అప్పటి నుంచి ఇప్పటివరకు కెరీర్‌లో ఒక్క రీమేక్ సినిమాలో కూడా మహేష్‌బాబు నటించలేదు. రీమేక్ కథలతో మహేష్‌బాబుకు చాలానే ఆఫర్లు వచ్చాయి. మహేష్ బాబు రిజెక్ట్ చేసిన రీమేక్‌లు పెద్ద హిట్టయినవి ఉన్నాయి అయినా రీమేక్‌ల విషయంలో మహేష్ నిర్ణయం మారలేదు. అరువు కథలకు దూరంగా ఉండాలనే రూల్‌ను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు.
గజిని రీమేక్‌లో…
సూర్య గజిని సినిమాను తెలుగులో మహేష్‌బాబుతో రీమేక్ చేయాలని ఓ టాప్ ప్రొడక్షన్ హౌజ్ అప్పట్లో గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ మహేష్ నిర్మొహమాటంగా తిరస్కరించారు. అగ్ర దర్శకుడు శంకర్ తాను రూపొందిచిన తమిళ మూవీ నన్బన్ (తెలుగులో స్నేహితుడు పేరుతో డబ్)లో మహేష్‌బాబును ఓ హీరోగా తీసుకోవాలని అనుకున్నారు. బాలీవుడ్ లో విజయవంతమైన త్రీ ఇడియట్స్ మూవీకి రీమేక్ కావడంతో శంకర్ ఆఫర్‌ను మహేష్‌బాబు రిజెక్ట్ చేశారు. బ్లాక్‌బస్టర్ మూవీ నవ్వే కావాలి మహేష్ చేయాల్సింది. కానీ రీమేక్ అనే ఆలోచనతో వదలుకున్నారు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
Also Read – CIBIL Score: క్రెడిట్ కార్డులకు మినిమం డ్యూ కట్టడం వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతింటుందా?
సీక్వెల్స్‌కు దూరమే…
రీమేక్‌లతో పాటు సీక్వెల్ సినిమాలకు మహేష్‌బాబు దూరంగా ఉంటున్నారు. హీరోగా 28 సినిమాలు చేస్తే అందులో ఒక్కటి కూడా సీక్వెల్ లేదు. పార్ట్2 ట్రెండ్‌పై మహేష్‌బాబుకు అంతగా నమ్మకం లేదు. సీక్వెల్స్ పేరుతో కథలను సాగదీయకుండా ఒక్క భాగంలోనే కథ మొత్తం చెప్పేయాలని నమ్ముతుంటారు. రాజమౌళితో చేయబోతున్న నెక్స్ట్ మూవీ కూడా సింగిల్ పార్ట్‌గానే తెరకెక్కుతున్నట్లు సమాచారం.
నెక్స్ట్ షెడ్యూల్…
ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కోసం ఇటీవలే మహేష్‌బాబు విదేశాలకు వెళ్లారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్‌లో టాంజానియా, ఈస్ట్ ఆఫ్రికాలలో జరుగనుంది. ఈ షెడ్యూల్‌లో మహేష్‌బాబు, ప్రియాంకచోప్రాతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు రాజమౌళి. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా మహేష్‌బాబు, రాజమౌళి సినిమా రూపొందుతోంది. ఎస్ఎస్ఎంబీ29లో మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – Broom: కొత్త చీపురు కొన్నాక.. పాత చీపురు ఏం చేయాలో తెలుసా


