Ghattamaneni Bharathi: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోలే ఎక్కువగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కృష్ణ వారసత్వాన్ని మహేష్‌బాబు కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. మహేష్‌బాబు అన్నయ్య రమేష్‌బాబు హీరోగా చాలా సినిమాలు చేశాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. కృష్ణ కూతురు మంజుల హీరోయిన్‌గా మారాలని కలలు కన్నది. కానీ అభిమానుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచనను పక్కనపెట్టింది. షో, కావ్యాస్ డైరీస్ వంటి సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది మంజుల. కృష్ణ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైమ్ టాలీవుడ్‌లోకి ఓ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నది. రమేష్‌బాబు కూతురు భారతి ఓ సినిమా చేయబోతున్నది.
రొమాంటిక్ లవ్‌స్టోరీ…
తనయుడు అమితవ్ తేజను హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ తేజ ఓ న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందట. ఈ సినిమాలో హీరోయిన్‌గా రమేష్‌బాబు కూతురు భారతి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే భారతిపై లుక్ టెస్ట్‌ను తేజ కంప్లీట్ చేసినట్లు తెలిసింది. భారతి టాలీవుడ్ అరంగేట్రంపై తొందరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని అంటున్నారు. చిత్రం, నువ్వునేను తరహాలో డిఫరెంట్ లవ్‌స్టోరీ డైరెక్టర్ తేజ ఈ మూవీని తెరకెక్కించనున్నారట.
Also Read – Rajinikanth : రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం – చంద్రబాబు, మోదీ శుభాకాంక్షలు
నేనే రాజు నేను మంత్రి తర్వాత…
డైరెక్టర్‌గా తేజ సక్సెస్ అందుకొని చాలా కాలమైంది. రానా హీరోగా నటించిన నేనే రాజు నేను మంత్రి తర్వాత తేజ తెరకెక్కించిన సీత, అహింస సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. నేనే రాజు నేను మంత్రి సినిమాకు రాక్షసరాజు పేరుతో సీక్వెల్ అనౌన్స్‌చేశారు. కానీ సినిమా మాత్రం సెట్స్‌పైకి రాలేదు. రాక్షసరాజు ఆగిపోవడంతో తన కొడుకు అమితవ్ మూవీపై తేజ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
అజయ్ భూపతి డైరెక్షన్‌లో…
రమేష్‌బాబు తనయుడు జయకృష్ణ కూడా హీరోగా మారుతున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తన తొలి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.


