Monday, June 23, 2025
Homeచిత్ర ప్రభMahesh Babu: ఆమిర్ ఖాన్ మూవీపై మహేశ్ బాబు ప్రశంసలు

Mahesh Babu: ఆమిర్ ఖాన్ మూవీపై మహేశ్ బాబు ప్రశంసలు

Mahesh Babu Praises aamir khan Movie: బాలీవుడ్ ష్టార్ హీరో ఆమిర్ ఖాన్ నిర్మాతగా మారి హీరోగా నటించిన చిత్రం ‘సితారే జమీన్ పర్’. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్రలో నటించారు. 2007లో సూపర్ హిట్ అయిన ‘తారే జమీన్ పర్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్పానిష్ మూవీ ఛాంపియన్స్ మూవీ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారని టాక్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే వసూళ్ల పరంగా కాస్త డల్ అయింది.

ఈ సినిమాను నిర్మించిన ఆమిర్.. మూవీని కూడా భారతదేశంలో 3500 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 4200 స్క్రీన్లలో సొంతంగా రిలీజ్ చేశారు. మూవీపై ఉన్న నమ్మకంతో ప్రముఖ ఓటీటీ సంస్థలు వంద కోట్ల రూపాయలకు పైగా ఆఫర్ ఇచ్చినా ఆమిర్ అంగీకరించలేదు. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాంటే రూ.100 కోట్లు కలెక్షన్స్ రావాలి. ట్రేడ్ వర్గా ప్రకారం మూడు రోజుల్లో రూ.60కోట్ల వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. మౌత్ టాక్ మెల్లగా పెరగడంతో కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈమేరకు మూవీ యూనిట్ కి కంగ్రాట్స్ చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందన్నారు. ఆమిర్ గత చిత్రాల్లాగానే క్లాసిక్ గా మిగిలిపోతుందన్నారు. ఈ మూవీ నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. చప్పట్లు కొట్టేలా చేస్తుందన్నారు. ఈ మూవీ చూశాక బయటకు వచ్చేటప్పుడు చిరునవ్వుతో బయటకు వస్తారని తెలిపారు. ప్రస్తుతం మహేష్ బాబు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుతోంది.

ఇక మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శత్వంలో పాన్ వరల్డ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ తన లుక్ మొత్తం మార్చుకున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News