Ssmb29: మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. నవంబర్‌లోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేయబోతున్నట్లు ఇదివరకే రాజమౌళి ప్రకటించారు. ఈ అప్‌డేట్‌కు సంబంధించి శనివారం మహేష్‌బాబు, రాజమౌళి మధ్య ట్విట్టర్ వేదికగా సాగిన సంభాషణ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ చాటింగ్‌లో ప్రియాంక చోప్రాతో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ అయ్యారు. ‘‘నవంబర్ వచ్చేసింది అప్‌డేట్ ఎక్కడ’’ అని రాజమౌళిని ట్విట్టర్ ద్వారా మహేష్‌బాబు అడిగారు. ‘‘అవును.. ఈ నెలలో ఏ సినిమాకు రివ్యూ ఇద్దామని అనుకుంటున్నావ్’’ అంటూ ఫన్నీగా రాజమౌళి రిప్లై ఇచ్చారు. ‘‘మీ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత రివ్యూ ఇవ్వాలని అనుకుంటున్నాను’’… అని మహేష్‌బాబు పంచ్ వేశారు. ‘‘ఆ తర్వాత నవంబర్‌లో అప్‌డేట్ ఇస్తానని ప్రామిస్ చేశారు. మాట నిలబెట్టుకోండి’’ అని రాజమౌళిని కోరారు మహేష్‌బాబు.
‘‘నవంబర్ మొదలైంది ఇప్పుడే కదా. ఒక దాని తర్వాత మరో అప్‌డేట్ నెమ్మదిగా ఇద్దామని’’ రాజమౌళి సరదాగా బదులిచ్చారు. ‘‘ఎంత నెమ్మదిగా సార్ 2030లో మొదలుపెడదామా? ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్ వీధుల్లో ఇన్‌స్టా రీల్స్ చేస్తుంది’’ అని రాజమౌళికి కౌంటర్ వేశారు మహేష్‌బాబు. చాటింగ్‌లోకి ఎంటరైన ప్రియాంక చోప్రా… మహేష్ ట్వీట్‌కు ఫన్నీగా బదులిచ్చింది. ‘‘హలో హీరో సెట్స్‌లో మీరు చెప్పే విషయాలన్నీ లీక్ చేయనా’’ అంటూ ట్వీట్ చేసింది. ‘‘మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా వేసేస్తా’’ అని ప్రియాంక ఈ ట్వీట్‌లో పేర్కొన్నది.
“ప్రియాంక చోప్రా ఉందనే సంగతి ఎందుకు చెప్పావ్ నువ్వు సర్‌ప్రైజ్ మిస్ చేశావ్” అని మహేష్‌ను ట్యాగ్ చేస్తూ రాజమౌళి మరో ట్వీట్ చేశారు. “పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారనే విషయాన్ని దాచాలనుకున్నారా” అంటూ మహేష్ మరో అప్‌డేట్‌ను బయటపెట్టేశారు. “హైదరాబాద్ వెకేషన్‌కు ఎందుకొస్తున్నానో ఇంట్లో కారణాలు చెప్పలేకపోతున్నా. ఇలాగే కొనసాగిస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను అనుమానిస్తున్నారు” అంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఓ ట్వీట్‌తో చాటింగ్‌తో ఎంటరయ్యారు.
Also Read – Jatadhara Pre Release Event: పాత్ర కోసం, సినిమా కోసం రికమెండ్ చేయమని మహేష్‌ని ఎప్పుడూ అడగలేదు: సుధీర్ బాబు
“నువ్వు అన్ని సర్‌ప్రైజ్‌లు బయటపెట్టేశావ్. అందుకే నీ ఫస్ట్‌లుక్ వాయిదా వేయాలని అనుకుంటున్నానని” మహేష్‌బాబుపై ఫైర్ అయినట్లుగా ఎమోజీని జోడించి రాజమౌళి ట్వీట్ చేశారు. “మీరు విలన్స్‌ను ఎంతగా ఇష్టపడతారో నాకు తెలుసు” అంటూ రాజమౌళిని ఉద్దేశించి పృథ్వీరాజ్ పేర్కొన్నారు. “ది బెస్ట్‌ను ఎప్పుడు రాజమౌళి చివరలోనే చూపిస్తారు” అంటూ మహేష్ బాబు మరో ట్వీట్ చేశారు.
ట్విట్టర్‌లో ఈ నలుగురి మధ్య సాగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్విట్టర్ చాటింగ్ ద్వారా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో నటిస్తున్న సంగతిని అఫీషియల్‌గా రివీల్ చేశారు. ఎస్ఎస్ఎంబీ 29 ప్రమోషన్స్‌ను రాజమౌళి, మహేష్‌బాబు మొదలు పెట్టేశారని నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఎస్ఎస్ఎంబీ 29 మూవీకి వారణాసి అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. నవంబర్ 16న టైటిల్, ఫస్ట్‌లుక్ లాంఛ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లు సమాచారం. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ గ్లోబ్ ట్రాటర్ మూవీ తెరకెక్కుతోంది.
Also Read – Chiranjeevi: మన శంకర వరప్రసాద్‌గారు సెకండ్ సింగిల్ అప్‌డేట్ – రంగంలోకి మరో క్రేజీ సింగర్!


