Mahesh Babu: ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా సినిమా లవర్స్ మహేష్‌బాబు, రాజమౌళి మూవీ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాతోనే మహేష్‌బాబు, రాజమౌళి ఫస్ట్ టైమ్ కలిసి పనిచేయబోతున్నారు. ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరగడానికి కారణమైంది.
ఫస్ట్ టైమ్…
కెరీర్‌లో ఇప్పటివరకు ఎమోషనల్, ఫాంటసీ, యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేశారు రాజమౌళి. మహేష్ సినిమా కోసం ఫస్ట్ టైమ్ తన రూట్ మార్చారు. ఆఫ్రికన్ జంగిల్ సఫారీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రాపర్ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.
Also Read – Manidhargal: 9.0 రివ్యూతో ఓటీటీకి దూసుకెళ్లిన థ్రిల్లర్ చిత్రం
వర్కింగ్ టైటిల్…
ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్‌తో మహేష్‌బాబు, రాజమౌళి సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కథేమిటి? ఇందులో మహేష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అన్నది రాజమౌళి ఇప్పటివరకు రివీల్ చేయలేదు. సస్పెన్స్‌ను అలాగే మెయింటేన్ చేస్తూ వస్తున్నాడు.
టాంజానియాలో…
ఎస్ఎస్ఎంబీ 29 నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే వారం టాంజనియాలో మొదలు కాబోతుంది. ఈ విషయాన్ని టాంజానియాకు చెందిన ది సిటిజన్ అనే పత్రిక వెల్లడించింది. టాంజానియాలోని అడవుల్లో మహేష్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై భారీ యాక్షన్, ఛేంజింగ్ సీన్స్‌ను రాజమౌళి షూట్ చేయబోతున్నట్లు సిటిజన్ పత్రిక పేర్కొన్నది. టాంజానియా తర్వాత మరో షెడ్యూల్‌ను సౌతాఫ్రికాలో షూట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఈ మీడియా సంస్థ వెల్లడించింది.
స్టోరీ లీక్…
షూటింగ్ అప్‌డేట్స్‌తో పాటు మూవీ ఈ మూవీని స్టోరీని ది సిటిజన్ లీక్ చేసింది. ఇండియానా జోన్స్‌తో పాటు ఆఫ్రికన్ అడ్వెంచరస్ క్లాసిక్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుబోతున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాలో మహేష్‌బాబు సాహసవంతుడైన అన్వేషకుడిగా కనిపిస్తాడని వెల్లడించింది. ఓ ప్రమాదకరమైన మిషన్ కోసం మారుమూల ప్రాంతంలో అడుగుపెడతాడు. అక్కడ ఓ పవర్‌ఫుల్ ఎనిమీతో పాటు ప్రకృతి శక్తులతో ప్రతి క్షణం అతడు ఎలాంటి పోరాటాలు చేయాల్సివస్తుంది? చాలా ఏళ్లుగా నిగూఢంగా ఉన్న ప్రపంచాన్ని మార్చే ఓ రహస్యాన్ని ఎలా బయటపెడతాడు అన్నదే ఎస్ఎస్ఎంబీ 29 కథ అని సిటిజన్ పత్రిక తన కథనంలో పేర్కొన్నది. యాక్షన్ , అండ్వెంచరస్ అంశాలే కాకుండా ప్రపంచ పురాణాలు, ఇతిహాసాలతో ముడిపడి థ్రిల్లింగ్‌గా ఈ సినిమా సాగుతుందని వెల్లడించింది. మహేష్‌బాబు, రాజమౌళి సినిమా గురించి టాంజానియా మీడియా రాసిన న్యూస్ వైరల్ అవుతోంది.
Also Read – Anand Mahindra: తెలుగులో ట్వీట్ చేసి షాకిచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఆయన ఏం రాశారంటే?
హాలీవుడ్‌ను మించిపోయేలా…
ఎస్ఎస్ఎంబీ 29 స్టోరీలైన్ హాలీవుడ్ సినిమాలను మించిపోయేలా ఉందని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. రాజమౌళిగట్టిగానే ప్లాన్ చేసినట్లు చెబుతోన్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు సౌత్, బాలీవుడ్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో మహేష్‌బాబు, రాజమౌళి మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. రాజమౌళి సినిమాతోనే ఫస్ట్ టైమ్ పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి మహేష్‌బాబు అడుగుపెట్టబోతున్నాడు.


