ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మరి మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవల సింగపూర్, హాంకాంగ్, మలేషియా, హాంకాంగ్, తదితర దేశాల్లో కొవిడ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కుటుంబం కరోనా బారిన పడింది. మహేశ్‌బాబు సతీమణి నమత్రా శిరోద్కర్ సోదరి బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్‌కు(Shilpa shirodkar) కరోనా సోకింది. తాను కొవిడ్ బారిన పడినట్టు ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో శిల్ప త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కరోనా మళ్లీ మొదలైందా అంటూ భయపడుతున్నారు.
Mahesh Babu: మహేశ్ బాబు ఇంట్లో కరోనా కలకలం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES