HBD Rajamouli: తెలుగు సినిమాకు ఆస్కార్ అన్నది ఒకప్పుడు కల. అసాధ్యం అనుకున్న ఆ కలను నిజం చేశారు దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం రాజమౌళి సినిమా అంటే హాలీవుడ్, బాలీవుడ్ అనే భేదాలు లేకుండా వరల్డ్ వైడ్‌గా ఉన్న సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అపజయమే లేని దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో రాజమౌళి ఒకరు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నీ ఇండస్ట్రీ హిట్లే. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న టాప్ ఫైవ్ సినిమాల్లో చోటు దక్కించుకున్నాయి.
ఎస్ఎస్ఎంబీ 29…
ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత మహేష్‌బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్‌తో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో పాన్ వరల్డ్ మూవీగా మహేష్‌బాబు, రాజమౌళి సినిమా రూపుదిద్దుకుంటోంది.
Also Read- Anupama Parameswaran: విక్రమ్ కొడుకుతో డేటింగ్ – అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్ ఇదే!
అన్నీ అద్భుతాలే…
కాగా శుక్రవారం రాజమౌళి బర్త్‌డేను పురస్కరించుకొని పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. మహేష్‌బాబు కూడా రాజమౌళికి బర్త్‌డే విషెస్ చెప్పారు. సినీ పరిశ్రమలో ఉన్న ఒకే ఒక దర్శకధీరుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు చేసే సినిమాలన్నీ అద్భుతాలే. మీ నుంచి త్వరలోనే మరో అద్భుతం రానుంది అని ట్వీట్ చేశారు. రాజమౌళితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో మహేష్‌బాబు ఎస్ఎస్ఎంబీ 29 లుక్‌లో కనిపిస్తున్నారు. సినిమా షూటింగ్‌లోనే దిగిన ఈ ఫొటోలో రాజమౌళి గట్టిగా నవ్వుతుండగా.. మహేష్‌బాబు చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. మహేష్‌బాబు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళికి మహేష్‌బాబుతో పాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు పలువురు స్టార్స్ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు.
Wishing the one and only @ssrajamouli a very Happy Birthday…The best is always yet to come😍😍😍..Have a great one sir 🤗🤗🤗♥️♥️♥️ pic.twitter.com/U3tcyJIbgv
— Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2025
ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ఫస్ట్ గ్లింప్స్ నవంబర్ 16న రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్ మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ గ్లోబ్ ట్రాటర్ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read- NTRNEEL: ఎన్టీఆర్ డ్రాగన్ మళ్లీ వాయిదా – వైరలవుతున్న రూమర్


