సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) తనయుడు గౌతమ్(Gautham) తాత, తండ్రి బాటలోనే నటుడు అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న గౌతమ్.. న్యూయార్క్‌లోని ప్రముఖ యూనివర్సిటీలో నటనలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. గతంలో లండన్‌లో తొలి స్టేజ్ ప్రదర్శన కూడా ఇచ్చాడు. తాజాగా తోటి విద్యార్థితో కలిసి ఓ స్కిట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో ప్రారంభంలో చిరునవ్వుతో కూల్‌గా కనిపించిన గౌతమ్.. కొద్ది క్షణాల్లోనే కోపంతో ఓ డైలాగ్ చెబుతూ కనిపించాడు. ఇది చూసిన అభిమానులు నటనతో భలే వేరియేషన్స్ చూపించాడంటూ ప్రశంసిస్తున్నారు. త్వరలోనే సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. కాగా గౌతమ్ బాలనటుడిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ మహేశ్ హీరోగా తెరకెక్కిన ‘1 నేన్కొక్కడినే’లో హీరో చిన్నప్పటి పాత్రలో అలరించాడు.