Bahubali Epic: రెబెల్‌స్టార్ ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి తెలుగు సినిమా స్టామినాను ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా లెవెల్‌కు చాటిచెప్పింది. బాహుబలికి కొనసాగింపుగా వచ్చిన బాహుబలి 2 బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. తెలుగు సినిమా ఐదు వందల కోట్ల కలెక్షన్స్‌ను దాటడం అసాధ్యం అనుకునే స్టేజ్ నుంచి ఇండియాలోనే అత్యధిక వసూళ్లను దక్కించుకున్న సినిమాగా బాహుబలి 2 నిలిచింది. పాన్ ఇండియన్ సినిమాలను రూపొందించడంలో తెలుగు హీరోలు, దర్శకులకు బాహుబలి, బాహుబలి 2 సినిమాలు రిఫరెన్స్‌లుగా నిలిచాయి. ఈ సినిమాలో ప్రభాస్ నేషనల్ వైడ్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. దర్శకుడిగా రాజమౌళి పేరు కూడా మారుమోగింది.
తాజాగా బాహుబలి, బాహుబలి 2 సినిమాలు మరోమారు థియేటర్లలోకి రాబోతున్నాయి. రెండు సినిమాలు కలిసి ఒకే పార్ట్‌గా బాహుబలి ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓవర్‌సీస్‌లో ఒక రోజు ముందుగానే బాహుబలి ఎపిక్ రిలీజైంది. టాలీవుడ్ అగ్ర హీరో మహేష్‌బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని న్యూయార్క్‌లో బాహుబలి ఎపిక్ మూవీని చూశాడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
Also Read – Faria Abdullah: స్విమ్ సూట్ లో సెగలు రేపుతున్న ఫరియా
ప్రపంచంలో బిగ్గెస్ట్ థియేటర్‌లో బాహుబలి ఎపిక్‌ను చూడటం ఎప్పటికీ మర్చిపోలేను. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడం కోసం ఇప్పుడు రెండేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఎడిట్ చేసిన తర్వాత సినిమా మరింత అద్భుతంగా ఉంది. రెండు పార్ట్‌లను ఒకే సారి చూడటం గ్రేటెస్ట్ ఫీలింగా అనిపిస్తోంది. నిజంగానే ఇది ఎపిక్ మూవీ. ప్రతి సెకన్‌కు గూస్‌బంప్స్‌ను కలిగించింది. ఆ ఎక్స్‌పీరియన్స్‌ను మాటల్లో చెప్పలేను. మెంటల్ వచ్చేసింది. అంత అద్భుతంగా సినిమా ఉంది. బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడటం ఓ క్రేజీ ఫీలింగ్. తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంతటి ఆదరణ దక్కడం చూస్తుంటే ఆనందంగా ఉందని గౌతమ్ పేర్కొన్నారు. బాహుబలి ఎపిక్ మూవీకి గౌతమ్ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాహుబలి ఎపిక్‌లో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. కాగా ప్రస్తుతం మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఫారెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ తో పాటు టైటిల్‌ను నవంబర్ 16న రివీల్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read – Rakul preet singh: జీన్స్ షాట్‌పై స్వెటర్.. వారెవ్వా ఏం ఉంది రకుల్ ప్రీత్ సింగ్!


