SSMB 29 Updates: మహేష్‌బాబు (Mahesh Babu) హీరోగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ 29 టాలీవుడ్ నుంచి ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా చరిత్రను సృష్టించేందుకు రెడీ అవుతోంది. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా షూటింగ్, ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ మూవీలో పలు భాషలకు చెందిన సూపర్ స్టార్స్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్లు ఇందులో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో జేమ్స్ కామెరూన్ (James Cameron) వంటి దిగ్గజ దర్శకులు పాల్గొననున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.
రాముడిగా..
కాగా మహేష్‌బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్‌బాబు రాముడిగా కనిపిస్తాడని అంటున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 అడ్వెంచరస్ యాక్షన్ మూవీ అయినా ఇందులో అంతర్లీనంగా మైథలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయట. సినిమాలో శ్రీరాముడికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంటుందని చెబుతున్నారు. మహేష్‌బాబు రాముడిగా కనిపించే సీన్స్ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తాయని అంటున్నారు. రాక్షస సంహారం నేపథ్యంలో ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని సమాచారం. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం పౌరాణిక కాలాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేయబోతున్నట్లు తెలిసింది. రాక్షసులతో మహేష్‌బాబు తలపడే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందట.
Also Read- Kishkindhapuri Review: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమల ‘కిష్కింధపురి’ మూవీ రివ్యూ
వార్నర్ బ్రదర్స్‌తో..
మహేష్‌బాబు, రాజమౌళి సినిమా 20 భాషల్లో 120 దేశాల్లో రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇంటర్నేషనల్ రిలీజ్ కోసం హాలీవుడ్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్‌తో మేకర్స్ డీల్ కుదుర్చుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.
కెన్యాలో షూటింగ్..
ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతోంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరించారు. ఈ లాంగ్ షెడ్యూల్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చిన మహేష్‌బాబు మూడు రోజుల క్రితం ఇండియా వచ్చారు. త్వరలోనే మళ్లీ ఆయన ఈ సినిమా షూటింగ్‌లో భాగం కాబోతున్నట్లు సమాచారం.
ప్రియాంక చోప్రా హీరోయిన్..
ఎస్ఎస్ఎంబీ 29 మూవీలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తోంది. మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో కేఎల్ నారాయణ మూవీని నిర్మిస్తున్నారు. 2027 ఆగస్ట్‌లో (SSMB 29 Release date) ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read- Diwali 2025: ఈ ఏడాది దీపావళి ఎప్పుడు? అక్కడ ఐదు రోజులు ఎందుకు జరుపుతారు?


