Sudheer Babu: వీలున్నప్పుడల్లా సుధీర్ బాబు (Sudheer Babu) సినిమాకు తన హెల్పింగ్ హ్యాండ్ అందిస్తుంటాడు మన ఘట్టమనేని కథానాయకుడు. ఇప్పుడు కూడా మరోసారి తనదైన సపోర్ట్ చేయటానికి మహేష్ రెడీ అయిపోయారు. వివరాల్లోకి వెళితే సుధీర్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘జటాధర’. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా నవంబర్ 7న (Jatadhara Release date) తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాను వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కిస్తున్నారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో రూపొందుతోన్న ఈ సినిమా ఆడియెన్స్‌కి ఓ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించటానికి సిద్ధమవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధార’కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే దసరా సందర్భంగా రిలీజ్ చేసిన ధన పిశాచి సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ హైప్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లటానికి మేకర్స్ ట్రైలర్‌ను సిద్ధం చేశారు.
శుక్రవారం జటాధర ట్రైలర్ (Jatadhara Trailer) విడుదల కానుంది. ఈ ట్రైలర్ సూపర్‌స్టార్ మహేష్ చేతుల మీదుగా రిలీజ్ కానుంది. ఆయన తన సోషల్ మీడియా ద్వారా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాలో మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ అక్క.. శిల్పా శిరోద్కర్ కూడా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
Also Read – Simbu: శింబు ‘సామ్రాజ్యం’ తారక్ సపోర్ట్.. ప్రోమో డేట్, టైమ్ ఫిక్స్
జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు. అక్షయ్ కేజ్రీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలు. డివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, భావిని గోస్వామి సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. సినిమాకి పవర్ ఫుల్ సౌండ్‌స్కేప్‌ను జీ మ్యూజిక్ కో అందిస్తోంది.
మహేష్‌బాబు తన సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొనటాన్ని సుధీర్ బాబు సెంటిమెంట్‌గా ఫీల్ అవుతుంటారు. సినిమా సక్సెస్ అయినట్లేనని భావిస్తుంటారు. ఇప్పుడు జటాధర ఆయన కెరీర్‌లో ఎంతో కీలకమైన సినిమా అనే చెప్పాలి. చాలా రోజులుగా హిట్ కోసం వెయిట్ చేస్తోన్న సుధీర్ బాబుకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి.
Also Read – Srinu Vaitla: ఎట్టకేలకు శ్రీనువైట్లకు హీరో దొరికేశాడుగా – పుష్ప ప్రొడ్యూసర్లతో నెక్స్ట్ మూవీ!


