Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభOG: హైప్ తగ్గించుకోండి.. అవన్నీ ఉండవు

OG: హైప్ తగ్గించుకోండి.. అవన్నీ ఉండవు

OG: రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజీత్ మొదటి సినిమాను యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుజీత్ మేకింగ్ స్టైల్ నచ్చడంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. బాహుబలి సిరీస్ లో రెండవ భాగం రిలీజ్ రోజు నుంచే సాహో టీజర్ ని రిలీజ్ చేసి భారీ హైప్ ని క్రియేట్ చేశాడు. సాహో రెండవ సినిమా అయినప్పటికీ హాలీవుడ్ రేంజ్ లో తీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అప్పటి వరకు ప్రభాస్ ని ఎవరూ ప్రజెంట్ చేయని విధంగా ఓ హాలీవుడ్ హీరో రేంజ్ లో చూపించాడు.

- Advertisement -

సాహో ఫలితం ఎలా ఉన్నా సినిమా రిలీజ్ కి ముందు నెలకొన్న హైప్ వేరే లెవల్. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. సాధారణంగా ఇలా ఓ పెద్ద హీరో సినిమా చేతి వరకూ వచ్చి మిస్ అయిందంటే ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశం రావడం చాలా కష్టం. కానీ, సుజీత్ అన్ని రకాలుగా ఎంతో అదృష్ఠవంతుడు. మెగాస్టార్ సినిమా మిస్ అయినా తర్వాత ఏ మిడ్ రేంజ్ హీరో సినిమానో చేజిక్కించుకొని అది సక్సెస్ అయితే మళ్ళీ పెద్ద హీరోను మెప్పించే ప్రయత్నాలు చేస్తారు. అలా కాకుండా పవర్ స్టార్ ని తన కథతో మెప్పించడం అంటే ఇక్కడే అతని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Also Read – Train Tickets: రైల్వే టికెట్ బుకింగ్‌ కొత్త రూల్స్.. ఆధార్ లింక్ చేస్తేనే ఫస్ట్ 15 నిమిషాల్లో టిక్కెట్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమిటైన సినిమాలలో ఓజీపై కూడా ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. గతంలో చేసిన పంజా, బాలు లాంటి గ్యాంగ్‌స్టర్ సినిమాల తర్వాత మళ్ళీ ఇంతకాలానికి ఓజస్ గంభీర అనే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఓజి పేరులోనే ఓ హై ఓల్టేజ్ ఉంది. ఇందులో పవన్ పాత్ర నెవర్ బిఫోర్ అనేలా తీర్చిదిద్దుతున్నాడు సుజీత్. హంగ్రీ చీతా లాంటి పదం కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి మాత్రమే సరిపోతుంది. అయితే, సాంగ్ లిరిక్స్ లో చీతా అనే పదాలు ఉండటం వల్ల చిరుత పులి ఉంటుందని ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ‘గన్స్ అండ్ రోజెస్’ సాంగ్ లో మిలటరీ షాట్స్, చిరుత షాట్స్ సినిమాలో ఉండవని.. అనవసరంగా హైప్ పెంచుకోవద్దని మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు. దీంతో కొంత పవన్ కళ్యాణ్ అభిమానులు నిరాశ చెందుతున్నట్టు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే, సినిమా మాత్రం ఎవరి ఊహకి అందని రేంజ్ లో ఉంటుందని సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ అందరిలో అంచనాలను పెంచేలా చెబుతున్నారు. ఇక ఇప్పటి వరకూ వచ్చిన సాంగ్స్ అన్నీ హిట్ గా నిలిచాయి. మరీ ముఖ్యంగా పవన్ స్టిల్స్ కి భారీ క్రేజ్ నెలకొంది. ఓజీ నుంచి వస్తున్న పవన్ ప్రతీ లుక్ ట్రెండ్ అవుతోంది. కాగా, ఓజీ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న రిలీజ్ కాబోతోంది.

Also Read – Junior Movie: ఓటీటీలోకి శ్రీలీల లేటెస్ట్ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ – రిలీజ్ ఎప్పుడంటే?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad