Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభTelugu Movie Titles: తెలుగు సినిమా టైటిల్స్ నెటివిటీ పోతుందా?

Telugu Movie Titles: తెలుగు సినిమా టైటిల్స్ నెటివిటీ పోతుందా?

Telugu Movie Titles: సినిమా అనగానే ఆడియెన్స్‌కి మొదటగా కనపడేది టైటిల్. థియేటర్‌కి పిలిచే తొలి పిలుపు అదే. స్టోరీ ఎంత బలంగా ఉన్నా టైటిల్ ఆకట్టుకోవాల్సిందే. ఒక విధంగా చూస్తే, టైటిల్‌ అనేది సినిమా ముఖచిత్రం లాంటిది. తెలుగు సినిమా విషయానికి టైటిల్స్‌లో హిందీ, ఇంగ్లీష్ పదాల హవా పెరిగిపోతోంది. దీనికి కారణమేంటి? గ్లోబల్ అప్పీల్ కోసం ట్రెండ్‌ను ఫాలో అవ్వడమా? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం..

- Advertisement -

ఈ మధ్య తెలుగు సినిమాల్లో టైటిల్స్ ఏ రూట్‌లో పోతున్నాయో అర్థం కావటం లేదు. అందుకు కారణం యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నమా లేక పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేసిన స్ట్రాటజీనా? అనేది ప్రశ్నగానే ఉంది. అదే సమయంలో తమిళం, మలయాళం మేకర్స్ మాత్రం భాషాభిమానానికి ఫుల్ స్కోర్ ఇస్తున్నారు. కబాలి, కాలా, జైలర్ నుంచి తంగలాన్, కంగువ, రాయన్ వరకు టైటిల్స్‌ను వారి భాషల్లోనే ఉండేలా చూసుకుంటున్నారు. మరి వాళ్లకు “నేమ్ బ్రాండ్” అంటే అదే.

అర్థం కాని టైటిల్స్ సినిమాను ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే డ్యామేజ్ చేస్తున్నాయంటూ ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. మాస్ ఆడియన్స్ టైటిల్‌ను కనెక్ట్ కావాలి. లేదంటే సినిమా ఏ భాషలో వచ్చినా, అది ‘వైరల్’ కాదు, ఒకప్పుడు విజయ్ ఆంటోనీ ‘సైతాన్’ని ‘భేతాలుడు’గా, పిచ్చైకారన్ ను బిచ్చగాడు మార్చి బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు. కానీ, టైటిల్ మార్చకుండా వచ్చిన ‘మార్గాన్’ ఫ్లాప్ అయింది. ఈ అనుభవం తర్వాతే ఆయన కొత్త సినిమాకు ‘శక్తి తిరుగమాన్’ స్థానంలో ‘భద్రకాళి’ అనే తెలుగు టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తున్నాడు. అంటే, టైటిల్ ఎంత ఇంపార్టెంట్ అనేది విజయ్ ఆంటోనీ తెలుసుకున్నాడనే చెప్పాలి.

Also Read – Hardik Pandya: వామ్మో.. హార్దిక్ పాండ్యా వాచ్‌ ఇంత ఖరీదా?.. ఎంతో తెలుస్తే పక్కాగా షాకవుతారు..!

మంజుమల్ బాయ్స్, ప్రేమలు వంటి మలయాళ టైటిల్స్ ఆకర్షణీయంగా ఉండి, స్ట్రాంగ్ కంటెంట్‌తో కలిసివచ్చినప్పుడు సూపర్ హిట్స్ అయ్యాయి. అంటే, సినిమా సక్సెస్ టైటిల్ మీదే కాదు, టైటిల్ ప్లస్ కంటెంట్ రెండూ కలిసివచ్చినప్పుడే హిట్ గ్యారెంటీ. ప్రభాస్ నటించిన సలార్, ది రాజా సాబ్, స్పిరిట్, పవన్ కళ్యాణ్ OG, రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్, తేజ సజ్జ.. మిరాయి, విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ది ఫ్యామిలీ స్టార్, కింగ్డమ్ వంటి టైటిల్స్‌ను చూస్తుంటే టాలీవుడ్ హీరోల ఇంగ్లీష్ టైటిల్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది తెలుస్తోంది.

పాన్ ఇండియా మార్కెట్‌ లక్ష్యంగా తీసుకునే వ్యూహాల్లో భాగంగా ఇంగ్లీష్ టైటిల్స్‌కి ప్రాధాన్యత పెరుగుతోంది అనేది స్పష్టమే. కానీ తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం ఒక చిన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది పూర్తిగా తప్పని చెప్పలేకపోయినా, కాస్త అర్థవంతంగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఇంగ్లీష్ టైటిల్స్‌ పెట్టిన కొన్ని చిత్రాలు.. క్రిటికల్ గానీ, కమర్షియల్ గానీ ఆశించిన విజయం సాధించలేదన్న అభిప్రాయం స్పష్టంగా వినిపిస్తోంది. ఈ ట్రెండ్‌ని పరిశీలిస్తే పాన్ ఇండియా అనే నినాదం ద్వారా మన నేటివిటీని పక్కన పెట్టేస్తున్నారా అనే చర్చలకు బలం చేకూరుతోంది.

సమయం వచ్చినప్పుడు, మార్కెట్‌కు అనుగుణంగా అయినా, మన మట్టివాసనను నిలుపుకుంటూ టైటిల్ ఎంపిక జరిగితేనే ఎక్కువ మందికి ఆత్మీయతగా అనిపిస్తుంది అనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకి, రౌద్రం రణం రుధిరం, రంగస్థలం, మగధీర వంటి బలమైన తెలుగు టైటిల్స్‌తో భారీ విజయాలు సాధించిన రామ్ చరణ్, తాజాగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి ఇంగ్లీష్ టైటిల్ ఎంచుకోవడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉండొచ్చు. కానీ ఆ టైటిల్‌తోనే సినిమా సరిగ్గా కనెక్ట్ కాలేకపోయినట్టుంది. మరి ఫ్యూచర్‌లో ఈ ట్రెండే కంటిన్యూ అవుతుందో లేక మారుతుందో చూడాలి మరి.

Also Read – Rains in AP: ఆంధ్రప్రదేశ్‌లో రేపు భారీ వర్షాలు: ఐఎండీ అంచనా..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad