Malavika Mohanan: వాల్తేర్ వీరయ్య తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాతో కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. నవంబర్ ఫస్ట్ వీక్‌లో చిరంజీవి, బాబీ మూవీ లాంఛింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లు సమాచారం. మెగా 158 అనే వర్కింగ్ టైటిట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజాసాబ్ ఫేమ్ మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించనున్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్‌పై బుధవారం సోషల్ మీడియా వేదికగా మాళవికా మోహనన్ రియాక్ట్ అయ్యింది.
“బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158లో నేను హీరోయిన్‌గా నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదు. కెరీర్‌లో ఒక్కసారైనా చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. కానీ మెగా 158లో మాత్రం నేను నటించడం లేదు” అని మాళవికా మోహనన్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఈ ట్వీట్‌తో మెగా 158పై వస్తోన్న రూమర్స్‌కు చెక్ పెట్టింది మాళవికా మోహనన్. ఆమె ట్వీట్ వైరల్ అవుతోంది.
Also Read – Rishabh Shetty: తెలుగు కాదు కన్నడం – రిషబ్ శెట్టి మూవీపై నాగవంశీ ట్విస్ట్!
మెగా 158లో కోలీవుడ్ హీరో కార్తి ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటించనున్నట్లు చెబుతున్నారు. ఈ రూమర్స్‌పై నవంబర్ ఫస్ట్ వీక్‌లో జరిగే ఓపెనింగ్ ఈవెంట్‌తో క్లారిటీ రావచ్చునని టాక్ వినిపిస్తుంది.
కాగా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ రాజాసాబ్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది మాళవికా మోహనన్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మాళవికా మోహనన్‌తో పాటు నిధి అగర్వాల్ మరో హీరోయిన్‌గా నటించబోతుంది.
మరోవైపు ప్రస్తుతం తెలుగులో మెగా 158తో పాటు మన శంకరవరప్రసాద్‌గారుతో పాటు విశ్వంభర సినిమాలు చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్‌గారు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుండగా… విశ్వంభర వేసవిలో థియేటర్లలోకి రాబోతుంది.


