Malavika Mohanan: సౌత్ సినిమా ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా మాళవిక మోహనన్ కి మంచి క్రేజ్ ఉంది. మోడల్ అయిన మాళవిక ముందుగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2013 లో వచ్చిన ‘పట్టం పోల్’ ఆమె మొదటి సినిమా. ఆ తర్వాత కన్నడ, హిందీ సినిమా ఇండస్ట్రీలలో ఎంట్రీ ఇచ్చింది. ప్రతీ ఏడాది ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. సౌత్ అండ్ నార్త్ లో మాళవిక కి మంచి క్రేజ్ ఉంది.
ప్రస్తుతం, ఈ హాట్ బ్యూటీ తెలుగులో స్ట్రైట్ గా చేస్తున్న మొదటి సినిమా ‘ది రాజాసాబ్’. ఏకంగా పాన్ ఇండియా సినిమాతోనే ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే, రాజాసాబ్ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ లో మాళవిక అందాల ఆరబోతతో పాటు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ చేస్తుందని దర్శకుడు మారుతి హింట్ ఇచ్చాడు. నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కూడా ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయినా, మాళవిక రోల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందనిపిస్తోంది.
Also Read – NBK 111: మరోసారి డ్యూయల్ రోల్ లో గాడ్ ఆఫ్ మాసెస్..
అయితే, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాల్సి ఉంది. మాళవిక నటించిన బ్లాక్ బస్టర్స్ రెండు ఇంతకుముందు సంక్రాంతికి వచ్చాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట్ట’ 2019, సంక్రాంతికి వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సిమ్రాన్ కూడా నటించారు. 2019, జనవరి 10 రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అలాగే, 2021 లో మాస్టర్ సినిమా వచ్చింది.
దళపతి విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి ఇందులో వినల్ గా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగి హిట్ సాధించింది. ఈ క్రమంలోనే ఈసారి 2026 సంక్రాంతికి ప్రభాస్, మారుతి కాంబోలో రూపొందుతున్న ది రాజాసాబ్ వస్తోంది. యాధృచ్చికంగా మాళవిక మోహనన్ కి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొస్తుందనుకోవచ్చు. చూడాలి మరి, రాజాసాబ్ తో మాళవిక తెలుగులో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంటుందో లేదో.
Also Read – Rashmi Gautam: గులాబీ డ్రెస్ లో రెచ్చగొడుతున్న రష్మీ గౌతమ్


