Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMohan laal: 6 ఏళ్ళకి ఓటీటీలో మెగాస్టార్ సినిమా

Mohan laal: 6 ఏళ్ళకి ఓటీటీలో మెగాస్టార్ సినిమా

మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ కి సౌత్ మొత్తంగా ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కన్నప్ప సినిమాలో ఓ గెస్ట్ రోల్ చేసి ఆకట్టుకున్నారు మోహన్ లాల్. అంతకముందు ఎన్‌టిర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు మోహన్ లాల్. మలయాళంలో సింపుల్ మూవీగా వచ్చి భారీ హిట్ సాధించిన దృశ్యం సిరీస్‌తో మోహన్ లాల్ మంచి విజయాలను అందుకున్నారు. మిగతా భాషలలో వచ్చిన ఈ మూవీ రీమేక్ బాగా సక్సెస్ అయింది.

- Advertisement -

అయితే, కరోనా తర్వాత నుంచి ఎంత పెద్ద సినిమా అయినా కూడా నెల రోజులు దాటి దాటగానే ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేస్తుంది. ఒకప్పుడు సినిమా రిలీజైన ఏడాదికి కూడా స్మాల్ స్క్రీన్ మీద వచ్చేది కాదు. దీని కొసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూసేవారు. పెద్ద పండగ వస్తే గానీ సినిమా టీవీలో వచ్చేది కాదు. కానీ, కొన్ని సినిమాలు నెల కూడా పూర్తి కాకుండానే ఓటీటీ లో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఓ మలయాళ మూవీ మాత్రం దాదాపు 6 ఏళ్ళ తరువాత ఓటీటీకి వచ్చేస్తోంది.

ఆ సినిమా మరేదో కాదు ‘ఇట్టిమాని: మేడ్ ఇన్ చైనా’. మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమా ఆరేళ్ళ క్రితం వచ్చింది. జిబి – జోజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రధాన పాత్రల్లో, రాధిక, హనీ రోజ్, సిద్ధికీ ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. 2019, సెప్టెంబర్ 6న ఈ మూవీ విడుదలైంది. దాదాపు, 12 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 35 కోట్లకి పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.

కాగా, ఇట్టిమాని సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని ‘ఈటీవీ విన్’ వారు దక్కించుకోగా, ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇట్టిమాని సినిమాలో మోహన్ లాల్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీ కొడుకులుగా ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాకు అప్పట్లో సినీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ నెల 24న ఓటీటీ లో రాబోతున్న ఇట్టిమాని చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad