Malayalam Actor Kalabhavan Navas: మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో సీనియర్ నటుడు కళాభవన్ నవాస్ (51)కన్నుమూశారు. మలయాళ సినిమా షూటింగ్ కోసం కేరళ… ఛోటనిక్కర లోని ఓ హోటల్‌లో బస చేశారు కళాభవన్ నవాస్.
అపస్మారక స్థితిలో…
షూటింగ్ ముగించుకొని రూమ్‌కు వచ్చిన నవాస్ అపస్మారక స్థితిలో కనిపించడంలో హోటల్ సిబ్బందితో కలిసి సినిమా యూనిట్ ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నవాస్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నవాస్ మృతికి కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదని సమాచారం. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును జరుపుతున్నట్లు తెలిసింది. గుండెపోటుతోనే నవాస్ కన్నుమూసి ఉంటాడని ప్రచారం జరుగుతోంది. నవాస్ హఠాన్మరణం సినిమా యూనిట్‌తో పాటు మలయాళ సినీ వర్గాలను షాకింగ్‌కు గురిచేస్తోంది.
Also Read – Friendship Day 2025: స్నేహితుల దినోత్సవం .అసలు ఎప్పుడు,ఎక్కడ మొదలైందంటే..!
చైతన్యం మూవీతో…
మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన నవాస్ 1991లో రిలీజైన చైతన్యం మూవీతో నటుడిగా అరంగేట్రం చేశాడు. 1995లో వచ్చిన మిమిక్స్ యాక్షన్ 500 సినిమా అతడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో బేబీ కుట్టి క్యారెక్టర్‌లో తన డైలాగ్ డెలివరీతో మలయాళ ఆడియెన్స్‌ను నవ్వించాడు. 34 ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు వందకుపైగా మలయాళ సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. హిట్లర్ బ్రదర్స్, మీనాక్షి కళ్యాణం, చందమామ, థిల్లానా థిల్లానా, ఏబీసీడీ, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో మెప్పించాడు.
డిటెక్టివ్ ఉజ్వలన్…
డిటెక్టివ్ ఉజ్వలన్… నటుడిగా నవాస్ చివరి మూవీ. ఈ ఏడాది మే నెలలో రిలీజైన ఈ మూవీ అశోకన్ అనే క్యారెక్టర్‌లో కనిపించాడు. నటుడిగానే కాకుండా కోబ్రా మూవీలో ఓ పాట పాడాడు. కళాభవన్ నవాస్ నటించిన టిక్కి టక, ప్రకంభనం సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా కొన్ని మలయాళ టీవీ షోస్‌కు హెస్ట్‌గా, జడ్జ్‌గా వ్యవహరించాడు సవాన్. వీడు, భాగ్యనక్షత్రం అనే సీరియల్స్‌లో నటించాడు.
భార్య కూడా యాక్టరే…
కళాభవన్ నవాస్… నటి రెహనాను 2002లో పెళ్లిచేసుకున్నారు. రెహానా మలయాళంలో సినిమాలు, సీరియల్స్ చేసింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నవాస్ కూతురు నహరిన్… కూకో అనే మలయాళ సినిమాలో నటించింది. కేరళలోని చుండిలో భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నారు నవాస్. నవాస్ మృతికి మలయాళ సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read – Chandrababu Naidu: ‘రైతులు, మహిళలకు ఆ సౌకర్యాలు కల్పించనున్నాం’


