Sahu Garapati: తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు సాహు గారపాటి. ప్రస్తుతం చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న మెగా157 మూవీని ఆయనే నిర్మిస్తున్నారు. తెలుగులో వరుసగా సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్న సాహు గారపాటి ఇటీవలే ప్రొడ్యూసర్‌గా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి ప్రయత్నంగా వ్యసనసమేతం బంధుమిత్రాధికల్ పేరుతో ఓ డార్క్ కామెడీ మూవీని నిర్మించాడు. థియేటర్లలో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది.
డార్క్ కామెడీ మూవీ…
వ్యసనసమేతం బంధుమిత్రాధికల్ మూవీ మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. విడుదల తేదీని మాత్రం వెల్లడించలేదు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి ఈ డార్క్ కామెడీ మూవీ మనోరమా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
రేఖా చిత్రమ్ హీరోయిన్
రేఖాచిత్రమ్ మూవీతో పెద్ద విజయాన్ని అందుకున్న అనశ్వర రాజన్… వ్యసనసమేతం బంధుమిత్రాధికల్ మూవీలో హీరోయిన్‌గా నటించింది.. ఈ సినిమాను జయ జయ జయ జయహే డైరెక్టర్ విపిన్ దాస్‌తో కలిసి తెలుగు నిర్మాత సాహు గారపాటి నిర్మించారు. ఈ మలయాళ మూవీలో సన్నీ, జోమోన్ జ్యోతిర్ కీలక పాత్రల్లో కనిపించారు. ఎస్ విపిన్ దర్శకుడిగా ఈ సినిమాతోనే మలయాళంలోకి అడుగుపెట్టారు
Also Read – Papaya Benefits: పచ్చి బొప్పాయి మధుమేహాన్ని ఎలా నియంత్రిస్తుందో తెలుసా?
పాజిటివ్ టాక్…
జూన్‌లో థియేటర్లలో రిలీజైన వ్యసనసమేతం బంధుమిత్రాధికల్ డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకున్నది. మంచి కలెక్షన్స్ రాబట్టింది. మరో రోజులో ఓ యువతి పెళ్లి జరగాల్సివుండగా.. ఆమె నానమ్మ గుండెపోటుతో చనిపోతుంది. పెళ్లితో సంబరాల్లో మునిగిపోవాల్సిన ఆ ఇంట్లో చావు ఎలాంటి విషాదాన్ని నింపింది? ఆ యువతి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? అనే కాన్సెప్ట్‌తో డైరెక్టర్ విపిన్ ఈ సినిమాను రూపొందించారు. మరణం అనే సెన్సిటివ్ అంశాన్ని ఫన్నీగా ఈ మూవీలో డీల్ చేసిన విధానానికి ప్రశంసలు దక్కాయి.
యూట్యూబర్‌పై పోలీస్ కంప్లైంట్…
రిలీజ్ తర్వాత ఈ మూవీ వివాదాల్లో చిక్కుకుంది. డబ్బులు ఇవ్వలేదనే కోపంతో తన సినిమాకు నెగెటివ్ రివ్యూను రాశాడంటూ ఓ యూట్యూబర్‌పై ప్రొడ్యూసర్ విపిన్ దాస్ పోలీసు కంప్లైంట్ ఇవ్వడం మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
టాప్ ప్రొడ్యూసర్…
నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం మూవీతో ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సాహు గారపాటి. నిర్మాతగా మజిలీ, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. లైలా, ఉగ్రమ్, టక్ జగదీష్ సినిమాలను సాహు గారపాటి నిర్మించారు. ప్రస్తుతం మెగా 157తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కిష్కిందపురి సినిమాలను ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు సాహు గారపాటి. మెగా 157 మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా… వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
Also Read – TGMSC: తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ లో ఉచిత సివిల్ సర్వీసెస్:2025 కోచింగ్..!


