Fahadh Faasil: మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్‌కు పాన్ ఇండియన్ వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. ఇమేజ్, స్టార్‌డమ్ లాంటి పట్టింపులు లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు ఫహాద్ ఫాజిల్. విలన్‌గా కూడా చాలా సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు.
భన్వర్‌సింగ్ షెకావత్…
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప, పుష్ప 2 సినిమాలతో విలన్‌గా అదగరొట్టాడు. భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రతో కామెడీ షేడ్స్‌తో సాగే సీరియల్ విలన్‌గా అద్భుతమైన నటనను కనబరిచాడు. ప్రస్తుతం మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఫహాద్ ఫాజిల్.
14 కోట్లు…
తాజాగా ఫహాద్ ఫాజిల్ ఓ కొత్త కారు కొన్నాడు. ఫెరారీ బ్రాండ్‌కు చెందిన ఈ ఎస్‌యూవీ కారు ధర విని నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఫెరారీ పురోసంజ్వా మోడల్‌కు చెందిన ఈ కారు ధర 14 కోట్ల వరకు ఉంటుందట. ఈ ఎస్‌యూవీ కారు కొన్న తొలి మలయాళ సెలిబ్రిటీగా ఫహాద్ ఫాజిల్ నిలిచాడు. ఈ కారును కోలీవుడ్ హీరో విక్రమ్, ముఖేష్ అంబానీ వంటి కొద్ది మంది సెలిబ్రిటీలు మాత్రమే వాడుతున్నారు. వారి సరసన ఫహాద్ ఫాజిల్ చేరాడు. గంటకు 310 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం ఈ కారు ప్రత్యేకతగా చెబుతున్నారు.
ఫెరారీ కంటే ముందు ఫహాద్ ఫాజిల్ దగ్గర కాస్ట్‌లీ కార్లు చాలానే ఉన్నాయట. లంబోర్గిని ఉరుస్, ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్సే 911 కరెరా వంటి కార్లను గతంలో కొనుగోలు చేశారు. తాజాగా అతడి గ్యారేజీలోకి ఫెరారీ కూడా చేరినట్లు ఫ్యాన్స్ చెబుతోన్నారు.
Also Read – Drugs:హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు..మొత్తం ‘గే’లే..!
రెండు సినిమాలు తీయచ్చు…
కాగా ఫహాద్ ఫాజిల్ కొత్త కారుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఫహాద్ కొత్త కారుతో మలయాళంలో రెండు సినిమాలు తీయచ్చునని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అంత కాస్ట్‌లీనా అంటూ చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో హీరోగా…
పుష్ప 2 తర్వాత తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు ఫహాద్ ఫాజిల్. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌తో పాటు ఆక్సిజన్ లో హీరోగా నటిస్తున్నాడు. తమిళంలో మారీసన్ మూవీతో విజయాన్ని దక్కించుకున్నాడు. మలయాళంలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
Also Read – CM visits Kamareddy: కామారెడ్డిలో సీఎం రేవంత్ పర్యటన


