Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి స్టైలే వేరు. యూత్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. గత ఎన్నికల టైమ్‌లో పూలమ్మిన, పాలమ్మిన అంటూ మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. తన మనసులో ఉన్నది ఏదైనా కుండబద్దలు కొట్టినట్లుగా మల్లారెడ్డి చెప్పేస్తుంటారు. మల్లారెడ్డికి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట. కానీ ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా మల్లారెడ్డి చెప్పారు. దసరా రోజున ఓ యూట్యూబ్ ఛానెల్‌కు మల్లారెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్‌పై మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
విలన్ పాత్ర కోసం…
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌లో విలన్ పాత్ర కోసం మల్లారెడ్డిని డైరెక్టర్ హరీష్ శంకర్ సంప్రదించారట. మూడు కోట్ల రెమ్యూనరేషన్‌ను ఇస్తామని చెప్పారట. విలన్ పాత్రలో నటించడానికి ఇష్టపడని మల్లారెడ్డి హరీష్ శంకర్‌కు నో చెప్పారట. ‘గంట పాటు ఉస్తాద్ భగత్‌సింగ్ కథ, నా పాత్ర గురించి హరీష్ శంకర్ వివరించారు. నన్ను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ నటించడం కుదరదని చెప్పానని’ మల్లారెడ్డి అన్నారు.
Also Read- Mahesh Babu: హైదరాబాద్‌లో మహేష్‌బాబు మరో మల్టీప్లెక్స్ థియేటర్ – చిరంజీవి సినిమాతో ఓపెనింగ్
ఇంటర్వెల్ వరకు…
‘విలన్ పాత్ర కావడంతోనే ఉస్తాద్ భగత్‌సింగ్‌ను రిజెక్ట్ చేశా. ఇంటర్వెల్ వరకు నేను హీరోను తిడతాను. ఇంటర్వెల్ తర్వాత హీరో నన్ను తిడతాడు. కొడతాడు. అందుకే ఈ సినిమాను చేయనని చెప్పాను. పాజిటివ్ క్యారెక్టర్ ఇస్తే మాత్రం తప్పకుండా నటించేవాడిని’ అని మల్లారెడ్డి అన్నారు. ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
షూటింగ్ కంప్లీట్…
గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ తెరకెక్కుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పవన్ కళ్యాణ్ ఇటీవలే పూర్తిచేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
డైరెక్టర్ హరీశ్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా చెయ్యమని 3 గంటలు వెయిట్ చేసి 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు అయినా కూడా ఒప్పుకోలే – మల్లా రెడ్డి pic.twitter.com/mOiMQng3v2
— Vennela Kishore Reddy (@Kishoreddyk) October 7, 2025
ఓజీ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 2023లోనే ఉస్తాద్‌భగత్‌సింగ్‌ను అనౌన్స్‌చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, డిప్యూటీ సీఏంగా బాధ్యతలు చేపట్టడంతో షూటింగ్ ఆలస్యమైంది.
Also Read- Rowdy Janrdhan: ఫ్లాప్ ప్రొడ్యూసర్‌తో మళ్లీ విజయ్ దేవరకొండ సినిమా.. డేట్ ఫిక్స్


