Mamitha Baiju: ప్రేమలు మూవీతో ఓవర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది మమితా బైజు. మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం మూడు కోట్ల బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజైన ప్రేమలు 130 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. ప్రేమలు సినిమాలో అందం, అమాయకత్వం కలబోసిన అల్లరి అమ్మాయిగా మమితా బైజు నాచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది.
ప్రేమలు బ్లాక్‌బస్టర్‌తో మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో మమితా బైజుకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. ఇటీవలే డ్యూడ్‌తో మరో హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో మమితా బైజు తన రెమ్యూనరేషన్‌ను పెంచినట్లు వార్తలొస్తున్నాయి. ఒక్కో సినిమా కోసం పదిహేను కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై మమితా బైజు రియాక్ట్ అయ్యింది. పదిహేను కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలను విని నేను నవ్వుకున్నాను. అవన్నీ అబద్దాలే. సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదంటూ కామెంట్స్ చేసింది. తాను సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండనంటూ పేర్కొన్నది. ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ సహజమంటూ తెలిపింది.
Also Read – Bus Accident: బస్సు ప్రమాదం.. బైకును తొలగించి ఉంటే 19 మంది ప్రాణాలు దక్కేవి!
మమితా బైజు హీరోయిన్‌గా నటించిన డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో హిట్టు టాక్‌ను తెచ్చుకుంది. వంద కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది మమితా బైజు. తమిళంలో దళపతి విజయ్‌తో జననాయగన్‌లో నటిస్తోంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మరో హీరోయిన్‌గా కనిపించబోతున్నది.
తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీలో సూర్యతో జోడీకడుతోంది మమితాబైజు. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ధనుష్, మారి సెల్వరాజ్ మూవీతో పాటు మమితా చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. రెండేళ్ల వరకు మమితా డేట్స్ ఖాళీ లేవని టాక్ వినిపిస్తోంది. ప్రేమలు కంటే ముందు మలయాళంలో చాలానే సినిమాలు చేసింది మమితా బైజు. సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించింది.
Also Read – Mega Family: మెగా హీరోల జాతర – మూడు నెలల్లో మూడు సినిమాలు


