Monday, May 19, 2025
Homeచిత్ర ప్రభManame of Sarvanand: మనమేతో శర్వా హిట్ కొట్టేనా?

Maname of Sarvanand: మనమేతో శర్వా హిట్ కొట్టేనా?

ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా..

డైనమిక్ హీరోగా పాపులర్ అయిన శర్వానంద్ కు అదేమిటో ఈమధ్య హిట్లే లేవు. దీంతో శర్వా కాస్త డల్ అయి దూకుడు తగ్గించినట్టు క్లియర్ గా కనిపిస్తోంది. లేటెస్ట్ గా ‘మనమే’ అనే సినిమాతో మళ్లీ తెలుగు ఆడియన్స్ ను పలకరించేందుకు వస్తున్న శర్వా మనమే పై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

- Advertisement -

‘మనమే’ జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా ఈ సినిమాపై మరో యంగ్ హీరోయిన్ కూడా చాలా ఆశలు పెట్టుకుని తన లక్ ను ట్రై చేస్తున్నారు. ఆమధ్య తెగ దూకుడు చూపిన శృతి షెట్టీకి కూడా పెద్దగా హిట్లు, ఛాన్సులు లేవు, దీంతో మనమేపైనే ఆమె కెరీర్ ఆధారపడిందని ఫిల్మ్ నగర్ టాక్.

శర్వాకు 35వ మూవీ..

డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ ‘మనమే’తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. ఇది ఆయనకు 35వ చిత్రం కావటం మరో హైలైట్. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ లావిష్ గా నిర్మించిన ఈ చిత్రం సమ్మర్ రేసులో చేరింది. సమ్మర్ ని ముగించడానికి మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసినట్లుగా జూన్ 7న ‘మనమే’ విడుదల కానుంది.

సినిమాలకు సమ్మర్ బిగ్గెస్ట్ సీజన్లలో ఒకటి. అయితే, ఈ ఏడాది సమ్మర్ లో టాలీవుడ్‌లో డీసెంట్ రిలీజులు జరగలేదు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 7న మనమే సినిమా థియేటర్లలోకి రావడంతో వారి నిరీక్షణ మరో రెండు వారాల్లో ఫలిస్తుంది. విడుదల తేదీ పోస్టర్ చేతిలో ల్యాప్‌టాప్ బ్యాగ్‌తో సూట్‌లో స్మార్ట్ అండ్ మోడరన్ అవతార్‌లో శర్వానంద్‌ని ప్రజెంట్ చేస్తోంది. తన ముఖం మీద ఆకర్షణీయమైన చిరునవ్వుతో చాలా ఆనందంగా కనిపించారు.

టీజర్‌లో చూపించినట్లుగా, ఈ చిత్రంలో శర్వానంద్, కృతి శెట్టి విభిన్న పాత్రలలో అలరించనున్నారు. ఇందులో విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ న్యూ ఏజ్ ఎంటర్‌టైనర్‌లో శ్రీరామ్ ఆదిత్య మార్క్ ఎంటర్ టైన్మెంట్ అద్భుతంగా వుంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News