Manchu Manoj| కొన్ని రోజులుగా జరుగుతున్న మంచు కుటుంబం వివాదాలకు చిన్న బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. బుధవారం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఎదుట మంచు మనోజ్, మంచు విష్ణు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దీంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన సీపీ.. ఇకపై ఎలాంటి గొడవలు చేయొద్దని సూచించారు. మరోసారి రిపీట్ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఈ వివాదంపై మనోజ్ సైలెంట్ అయ్యారు. తన వెంట ఉన్న వ్యక్తిగత సిబ్బంది, బౌన్సర్లను వెనక్కి పంపివేశారు.
ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్ కంప్లీంట్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. గురువారం ఉదయమే ‘భైరవం’(Bhairavam) మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ప్రధాన పాత్రలో నారా రోహిత్(Nara Rohit) కూడా నటిస్తున్న ఈ చిత్రంలో మనోజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే 90శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే నారా రోహిత్‌కు పితృవియోగం, మనోజ్ ఆస్తుల వివాదం వల్ల షూటింగ్ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో మూవీ రిలీజ్ కూడా వచ్చే ఏడాది ఉండనుంది.