Tuesday, March 18, 2025
Homeచిత్ర ప్రభManchu Lakshmi: మంచు లక్ష్మీని భయపెడుతున్న వివాదం.. అరెస్ట్ తప్పదా..?

Manchu Lakshmi: మంచు లక్ష్మీని భయపెడుతున్న వివాదం.. అరెస్ట్ తప్పదా..?

కోట్ల రూపాయలకు ఆశపడి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్‌లు ఇప్పుడు సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నాయి. సినీ, టీవీ తారలు తాము గతంలో ప్రమోట్ చేసిన యాప్‌ల వీడియోలను తొలగించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికే ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో వారికి టెన్షన్ పట్టుకుంది. ఈ వివాదంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఇరుక్కున్నారు. తాజాగా మంచు లక్ష్మి కూడా ఈ జాబితాలో చేరింది.

- Advertisement -

గతంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బెట్టింగ్ యాప్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో మిగతా వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఆమెను ఎందుకు వదిలేశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మంచు లక్ష్మితో పాటు పలువురు ప్రముఖ హీరోయిన్లు కూడా ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేశారు. అయితే వారు చాలాకాలం క్రితమే ఆ వీడియోలను తొలగించడంతో ప్రస్తుతానికి వారి పేర్లు బయటకు రాలేదు.

అయితే ఇంకా ఎవరెవరు ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేశారో బయటపెట్టడానికి కొందరు పాత వీడియోలను వెలుగులోకి తేవడానికి సిద్ధమవుతుండటంతో మరికొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఈ వివాదంలో ఇరుక్కోవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి వీడియోపైనా దర్యాప్తు చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. సెలబ్రిటీలు జైలుకు వెళ్లొచ్చు. మరి ఈ వివాదం ఎటువైపు వెళుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News