Manchu Lakshmi| మంచు కుటుంబంలో వివాదాలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, గొడవలతో కుటుంబ సమస్యలను రోడ్డుకీడ్చారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మనోజ్, విష్ణు అయితే కయ్యానికి కాళ్లు దువ్వుతున్నారు. ఇదే సమయంలో జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం కూడా తీవ్ర రచ్చ రేపుతోంది. ఓవైపు తమ కుటుంబంలో ఇంత రచ్చ జరుగుతుంటే మరోవైపు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ మాత్రం సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు.
తాజాగా ఇన్‌స్టాలో ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియోను షేర్ చేస్తూ ‘‘పీస్’’ అని క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుత కుటుంబ పరిస్థితుల రీత్యా ఆమె ఈ విధంగా పోస్ట్ చేశారని తెలుస్తోంది. అయితే దీని కంటే ముందు ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో మరో పోస్ట్ పెట్టారు. ఈ ఏడాదిలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు ఆ పోస్టులో రాసి ఉంది. ఈ పోస్టులు చూసిన నెటిజన్లు ఓవైపు తండ్రి, అన్నదమ్ములు కొట్టుకునేంత వరకు వెళ్తే.. సమస్యను పరిష్కరించకుండా ఇలా ఇన్‌స్టా పోస్టులు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు.