Manchu Lakshmi: మంచు లక్ష్మిని టాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్‌గా చెబుతుంటారు. తన మనసులో ఉన్నది ఏదైనా నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతుంటుంది. కొంత గ్యాప్ తర్వాత దక్ష మూవీతో యాక్టర్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మంచు లక్ష్మి. తండ్రి మోహన్‌బాబుతో కలిసి మంచు లక్ష్మి చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన దక్ష సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మంచు లక్ష్మి తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
హైదరాబాద్ నుంచి ముంబైకి…
కొన్నేళ్ల క్రితం మంచు లక్ష్మి హైదరాబాద్ నుంచి ముంబాయికి షిప్టయ్యింది. ప్రస్తుతం కూతురితో కలిసి అక్కడే ఉంటుంది. అప్పులు ఎక్కువైపోయి మంచు లక్ష్మి ముంబాయికి వెళ్లియిపోయిందని పుకార్లు వచ్చాయి. అప్పుల కారణంగా హైదరాబాద్‌లోని తన ఇల్లును మంచు లక్ష్మి అమ్మకానికి పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఈ రూమర్స్‌పై దక్ష ప్రమోషన్స్‌లో మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చింది.
ఇల్లు లేదు…
హైదరాబాద్‌లో తనకు అసలు ఇల్లు లేదని మంచు లక్ష్మి చెప్పింది. “ఫిలింనగర్‌లో ఉన్న ఇల్లు నా స్వంతం కాదు. ఆ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఇల్లు మా నాన్నది. ఆయన అంగీకారంతోనే నేను ఆ ఇంట్లో ఉన్నాను. ఆ ఇంటికి సంబంధించిన ఏ వివరాలైనా నాన్నను అడగాల్సిందే” అంటూ మంచు లక్ష్మి చెప్పింది.
Also Read – Madhya Pradesh Sidhi Murder : బేస్‌బాల్ బ్యాట్‌తో మహిళా హెడ్ కానిస్టేబుల్ ను కొట్టి చంపిన భర్త
రెంట్ చెల్లించడానికి ఇబ్బంది…
ముంబాయికి వెళ్లిపోవాలన్నది తన నిర్ణయమేనని మంచు లక్ష్మి పేర్కొన్నది. “నా ఇష్టంతోనే ముంబై వెళ్లాను. అక్కడ అద్దె ఇంటిలో ఉంటున్నా. రెంట్ చెల్లించడానికి ఇబ్బంది అవుతున్నా ఉన్నంతలో సరిపెట్టుకుంటున్నా. డబ్బు సాయం చేయమని నాన్నతో పాటు ఎవరిని అడగలేదు. సినిమాలు, షోల ద్వారా వచ్చిన డబ్బులతో జీవితంలో ముందుకు సాగుతున్నా” అని మంచు లక్ష్మి చెప్పింది.
మనోజ్ వల్లే…
మంచు మనోజ్ వల్లే తాను ప్రొడ్యూసర్‌గా మారాల్సి వచ్చిందని మంచు లక్ష్మి తెలిపింది. “నేను మీకు తెలుసాతో నిర్మాతగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. ఝుమ్మందినాదం, ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలోనే లాక్ అయ్యాను” అని మంచు లక్ష్మి అన్నది.
యాక్టర్‌గా అనగనగా ఒక ధీరుడు, గుండెల్లో గోదారి, చందమామ కథలు, దొంగాటతో పాటు పలు తెలుగు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది.
Also Read – ACB Raids: విద్యుత్ శాఖ ఏడీఈ నివాసంలో ఏసీబీ దాడులు.. బినామీ వద్ద రూ. 2 కోట్లు స్వాధీనం


