Monday, May 19, 2025
Homeచిత్ర ప్రభManchu Manoj: 'భైరవం'లో మంచు మనోజ్ మాస్ లుక్.. అదిరిపోయిందిగా..

Manchu Manoj: ‘భైరవం’లో మంచు మనోజ్ మాస్ లుక్.. అదిరిపోయిందిగా..

Manchu Manoj| మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. నెగెటిల్ రోల్స్‌తో అభిమానులను భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భైరవం(Bhairavam) చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మనోజ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో మాస్ లుక్‌తో మనోజ్ లుక్ అదిరిపోయింది.

- Advertisement -

నల్ల రంగు చొక్కా, లుంగీ కట్టుకుని వర్షంలో నడుస్తూ ఉన్నాడు. ఇందులో ఆయన గజపతి పాత్రలో నటించనున్నట్లు టీమ్‌ తెలిపింది. మనోజ్ సీరియస్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన బెల్లంకొండ, నారా రోహిత్ లుక్‌లు కూడా సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ముగ్గురు యువ హీరోలు కలిసి నటిస్తోన్న చిత్రం కావడంతో మూవీపై హైప్ నెలకొంది.

కాగా ‘భైరవం’ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె రాధా మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News